Telangana Health Director Gadala Srinivas Makes Controversial Comments On Corona: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందని అన్నారు. భారత దేశాభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని పేర్కొన్నారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందని చెప్పారు. అలాగే.. మంచిని ప్రేమించాలని, మంచిని ప్రేమించాలని చెప్తున్న అన్ని జాతులు, మతాలను మనం గౌరవిస్తూ ముందుకు తీసుకుపోతుండటం వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రపంచంలో భారతదేశం మనుగడ సాగించలేకపోయేదని, ఇంత అభివృద్ధి కూడా చెందలేదని అన్నారు. కానీ.. ఆరోజుల్లో మానవ రూపంలో వచ్చిన ఏసుక్రీస్తు మన దేశానికి ఆధునిక వైద్యాన్ని, ఆధునిక విద్యను, ఆధునిక సంస్కృతిని తీసుకురావడం వల్ల మన దేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందు స్థానంలో ఉందని తెలిపారు.
Black Adam: ఇకపై ‘బ్లాక్ ఆడమ్’ సినిమాలు ఉండవు
అయితే.. గడల శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవుడి వల్లే కరోనా తగ్గిందని ఆయన చెప్పడంలో తప్పు లేదని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఇలా మతాన్ని అందరిపై రుద్దడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతంపై ప్రేమ, అభిమానం ఉండొచ్చు గానీ.. ఇలా ఏకపక్షంగా మాట్లాడటం తగదని పేర్కొంటున్నారు. ఇలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవాలని.. హెల్త్ డైరెక్టర్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విషయం తెలియక తాను అనవసరంగా మూడో డోస్‌ల వ్యాక్సిన్ వేయించుకున్నానంటూ ఒక నెటిజన్ సెటైరికల్ ట్వీట్ చేశాడు.
Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ