‘డ్వేన్ డగ్లస్ జాన్సన్’ అనే పేరు పెద్దగా తెలియక పోవచ్చు కానీ ‘ది రాక్’ అనే పేరు మాత్రం ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ‘రాక్’గా వ్రెస్లింగ్ అభిమానులని అలరించిన ‘డ్వేన్ జాన్సన్’, వ్రెస్లింగ్ కెరీర్ కి గుడ్ బై చెప్పేసి సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. వరల్డ్స్ హైయెస్ట్ పెయిడ్ హీరోగా పేరు తెచ్చుకున్న ‘డ్వేన్ జాన్సన్’, ఇటివలే నటించిన సినిమా ‘బ్లాక్ ఆడమ్’. DC కామిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సూపర్ హీరో సినిమా అక్టోబర్ 3న ఆడియన్స్ ముందుకి వచ్చింది. 260 మిలియన్ డాలర్స్ తో రూపొందిన ‘బ్లాక్ ఆడమ్’ సినిమా ఓవరాల్ గా 400 మిలియన్ డాలర్స్ కూడా రాబట్టలేక పోవడంతో, ఈ మూవీని ఫ్లాప్ సినిమాల లిస్టులో వేశారు. కథ పరంగా, మేకింగ్ పరంగా కొత్తదనం కూడా లేకపోవడంతో ‘బ్లాక్ ఆడమ్’ సినిమా DC కామిక్స్ నుంచి వచ్చిన వీకెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఆశించిన స్థాయిలో రిజల్ట్ లేకపోవడంతో DC కామిక్స్ నుంచి ‘బ్లాక్ ఆడమ్’ సీరీస్ లో మరో సినిమా వచ్చే అవకాశం లేదు. ఈ విషయాన్ని ‘డ్వేన్ జాన్సన్’ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ట్వీట్ చేశాడు. “DC కో-సీఈవో అయిన ‘జేమ్స్ గన్’తో డిస్కస్ చేసిన తర్వాత ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. బ్లాక్ ఆడమ్ ఫ్యూచర్ గురించి మీరంతా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు కానీ ఇప్పట్లో బ్లాక్ ఆడమ్ కి సంబంధించిన మరో ఫుల్ లెంగ్త్ సినిమా రాకపోవచ్చు. కాకపోతే ఇతర హీరోల సినిమాల్లో బ్లాక్ ఆడమ్ పాత్ర కనిపించే ఛాన్స్ ఉంది” అంటూ ‘డ్వేన్ జాన్సన్’ ట్వీట్ చేశాడు. సూపర్ హీరో సినిమాలు అంటే ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకోని బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అవెంజర్స్, సూపర్ మాన్, బాట్ మాన్ లాంటి క్యారెక్టర్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు అంటే దానికి కారణం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడమే. అలాంటిది ఒక్క సినిమా నిరాశపరచగానే ‘బ్లాక్ ఆడమ్’ క్యారెక్టర్ ని ఎండ్ చేసే అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారో DCకే తెలియాలి.
Black Adam⚡️ pic.twitter.com/b7ZbCJZxBw
— Dwayne Johnson (@TheRock) December 20, 2022