HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
- రాష్ట్రవ్యాప్తంగా 6,092 కి.మీ రోడ్ల అభివృద్ధికి భారీ ప్లాన్
- హ్యామ్ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి సుదీర్ఘ సమీక్ష
- బిటుమెన్ ధరలు డబుల్.. పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయం
- సీఎం రేవంత్‌తో కీలక చర్చల తర్వాత తుది నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HAM Projects : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని రహదారులను అత్యంత నాణ్యతతో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకోసం దేశవ్యాప్తంగా ఎన్హెచ్ఏఐ (NHAI) , ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్న హ్యామ్ మోడల్ వివరాలను మంత్రికి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవునా 34 ప్యాకేజీలుగా విభజించి ఈ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమీక్షలో టెండర్ ప్రక్రియ , క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లపై మంత్రి అధికారులను ఆరా తీశారు.
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టుల వ్యయం పెరగడానికి గల కారణాలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు , ఇతర ఆర్థిక కారణాల వల్ల రోడ్ల నిర్మాణంలో కీలకమైన బిటుమెన్ (తారు) ధర మెట్రిక్ టన్నుకు గతంలో ఉన్న రూ. 44 వేల నుంచి ఏకంగా రూ. 89 వేలకు పెరిగిందని, అంటే దాదాపు 100 శాతం మేర ధరల పెరుగుదల నమోదైందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు జీఎస్టీ అదనపు భారం , ఇతర నిర్వహణ ఖర్చులు కూడా ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో టెండర్ల ఎక్సెస్ శాతం తక్కువగానే ఉందని అధికారులు గణాంకాలతో సహా వెల్లడించారు. ఉదాహరణకు గుజరాత్లో 66 శాతం, మహారాష్ట్రలో 47 శాతం వరకు ఎక్సెస్ నమోదవుతుండగా, మన రాష్ట్రంలో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా సుమారు రూ. 4–5 లక్షల కోట్లతో 374కు పైగా ఇటువంటి హ్యామ్ ప్రాజెక్టులు సాగుతున్న నేపథ్యంలో, తెలంగాణలో కూడా నాణ్యమైన రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టుల వల్ల రహదారుల నిర్మాణమే కాకుండా సుదీర్ఘ కాలం పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా పక్కాగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. హ్యామ్ ప్రాజెక్టులకు సంబంధించిన తుది నిర్ణయాలు , ఇతర కీలక అంశాలపై రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి స్వయంగా చర్చిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఈ భారీ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!