హైదరాబాద్ నగరంలోని ఘాట్‌కేసర్ ఫ్లైఓవర్ పనులు పునఃప్రారంభించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పనులు గత కొన్ని నెలలుగా ఆగిపోయిన నేపథ్యంలో ప్రజలకు ఎదురవుతున్న అసౌకర్యాన్ని వివరించారు. రోజూ ట్రాఫిక్ జాంలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని, అందువల్ల పనులను వేగంగా పూర్తిచేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం వెంటనే అవసరమైన నిధులను మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది. PM Modi: 8న…
Uppal Fly Over: హైదరాబాద్ (HYD) నుంచి యాదాద్రి (Yadadri) , వరంగల్ (Warangal) మార్గంలో పెండింగ్లో ఉన్న ఉప్పల్-నారపల్లి (Uppal-Narapalli) ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులకు మోక్షం లభించింది. గాయత్రి కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో, టెండర్ రద్దు చేయడం జరుగుతుందని, ఈ హెచ్చరికపై కంపెనీ పనులను తిరిగి ప్రారంభించింది. ఈ ఫ్లై ఓవర్ ను హైదరాబాద్ నుంచి యాదాద్రి-భువనగిరి-వరంగల్ మార్గంలో రద్దీ తగ్గించేందుకు నిర్మిస్తున్నారు. మొత్తం…
గతంలో 117 జీఓ తెచ్చి విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేశారని.. 117 జీఓను రద్దు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.జనవరి నుండి ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. విద్యా కిట్లు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
సంక్రాంతిలోగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపై గుంతలను పూడ్చి వేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని, ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. టూరిజంకు భారీ నష్టం వాటిల్లిందని మంత్రి తెలిపారు.
గత నలభై ఏళ్లుగా ఇల్లందు నియోజక వర్గంతో నాకు అనుబంధం ఉందని, ఆదివాసీలు గిరిజనులు ఎక్కువగా ఉన్న భద్రాచలం పినపాక ఇల్లందు నియోజక వర్గాల్లో ఎక్కువ సమయం కేటాయించా అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.
ఆంధ్రప్రదేశ్ లో రహదారుల చుట్టూ రాజకీయం ముసురుకుంటోంది. దెబ్బతిన్న రహదారులపై.. విపక్షాలు సమరభేరి మోగిస్తుంటే.. అధికార పక్షం సైతం దీటుగా స్పందిస్తూ.. టగ్ ఆఫ్ వార్ గా ముందుకు వెళ్తోంది. అవసరమైతే అప్పులు సైతం తీసుకునైనా రోడ్లు బాగు చేస్తామని ప్రభుత్వం నుంచి స్పందన వస్తుంటే.. ఇటు టీడీపీ, జనసేన నేతలు ఈ అంశాన్ని జనంలోకి తీసుకువెళ్లేందుకు యత్నిస్తున్నాయి.ఇప్పటికే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ విషయమై మాట్లాడారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ఉధృతంగా ప్రచారంలోకి…