Shankar- Ranveer Singh: రణ్ వీర్ సింగ్ తో శంకర్ ‘వేల్ పరి’ ట్రయాలజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shankar- Ranveer Singh: ‘ఇండియన్ 2’, ‘అపరిచితుడు’ రీమేక్ రైట్స్ వివాదాల నుంచి దర్శకుడు శంకర్ బయటపడ్డారు. ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC15, కమల్ హాసన్‌తో ‘భారతీయుడు 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతే కాదు హిందీలో రణవీర్ సింగ్‌తో ‘అపరిచితుడు’ తీస్తానని ప్రకటించిన దానికి భిన్నంగా వేరే ప్రాజెక్ట్ తో ముందుకు వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్నాడట శంకర్. మణిరత్నం ప్రముఖ తమిళ నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా రెండు భాగాలుగా సినిమా తీసి మొదటి భాగంతో సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు శంకర్ కూడా మణిరత్నం లాగే ఫేమస్ నవల వేల్ పరి ఆధారంగా రణ్ వీర్ తో మూడు భాగాలుగా సినిమా తీయాలనుకుంటున్నాడట. సంగమ్ ఎరాలో పరంబునాడు ని ఏలిన వేల్ పరి అనే రాజు గురించిన కథే ఈ నవల. సంగమ్ ఎరా కాలం నాటి ప్రముఖ కవి కపిలర్ రాసిన నవల ఇది.
Read also: Polish Leader: యువతుల అతి మద్యపానమే సంక్షోభానికి కారణం.. పోలిష్ నేత సంచలన వ్యాఖ్యలు
Also Read
- The Paradise: 'ది ప్యారడైజ్' ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
- Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
- Udaya Bhanu : నా పర్సనల్ లైఫ్ రచ్చకెక్కి ఛానళ్ల దాకా ఎందుకు వెళ్లిందంటే.. అసలు నిజాన్ని బయటపెట్టిన ఉదయభాను!
- Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. 'నా శ్రీమతి' అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
చేర, చోళ, పాండ్య రాజులు రాజ్యకాంక్షతో నిర్దాక్షిణ్యంగా విస్తరించుకుంటూ పోయారు. స్వతంత్ర రాజులపై దండెత్తి వారిని అధీనంలోకి తీసుకుని వారి రాజ్యాలను సమీకరించారు. అలాగే పరంబు దేశాన్ని కూడా ముట్టడించారు. అయితే వేల్ పారి రాజు లొంగిపోవడానికి నిరాకరించటంతో యుద్ధం సంవత్సరాలపాటు సాగింది. వేల్ పారిని జయించలేని యోధుడని కీర్తిస్తూ వెనుదిరిగి వెళ్ళారు. ఈ నవల అద్భుతమైన సినిమా అడాప్టేషన్‌గా మార్చే అంశాలను కలిగి ఉండటంతో శంకర్ దృష్టి దీనిపై పడింది. జీవిత పాఠాలతో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ, యాక్షన్ అడ్వెంచర్ కు స్కోప్ ఉండటంతో వీటిని మైండ్‌బ్లోయింగ్ విజువల్-ఎఫెక్ట్ సీక్వెన్స్‌లుగా ప్రొజెక్ట్ చేసే స్కోప్ ఉంది. అందుకే దీనిని భారీ బడ్జెట్‌తో బహుళ భారతీయ భాషల్లో మూడు భాగాలుగా తీయాలనుకుంటున్నాడు శంకర్. రణ్‌వీర్ సింగ్‌తో ‘వేల్ పారి’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ముందు శంకర్ రామ్ చరణ్ సినిమాతో పాటు కమల్ ‘భారతీయుడు 2’ని పూర్తి చేస్తాడట. ఈ లోగా అటు రణ్ వీర్ కూడా రోహిత్ శెట్టి, కరణ్ జోహార్ సినిమాలు ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’, సంజయ్ లీలా బన్సాలీ ‘బైజు బావ్రా’ పూర్తి చేస్తాడని టాక్. మరి మణిరత్నం అడుగుజాడల్లో నడవబోతున్న శంకర్ దీనితో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Crime in Hyderabad: రెండో భర్తతో భార్య.. పెట్రోల్ పోసి నిప్పంటిచిన మొదటి భర్త
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!