KCR Govt: ఇమామ్‌లు, మౌజంలకు గుడ్‌న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR Govt: మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, బంజరు భూమి పట్టాల పంపిణీ, రైతు బంధు వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతు రుణమాఫీ, రూ.లక్ష సాయం, మైనార్టీలకు గృహలక్ష్మి పథకాల అమలుకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని రూపొందించారు. తాజాగా రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజామ్‌ల లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
Read also: Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
Also Read
ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది మౌజమ్‌లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. అన్నింటికి రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని ఆదివారం జరిగిన సమావేశాల్లో వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు ఇచ్చే విధంగా మౌజమ్‌లు, ఇమామ్‌లకు కూడా అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. మరో 7,005 మంది మౌజమ్‌లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్ లు, మౌజామ్ లు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతుండగా, కొత్తగా చేరిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్ లు, మౌజమ్ ల సంఖ్య 17 వేలకు చేరింది. ఈ పథకం కింద మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ. 1000 గౌరవ వేతనం ఇచ్చేవారు ఆతరువాత.. 1500 ఆపై రూ. 5,000 పెంచడంతో ఇమామ్‌లు, మౌజంలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు
తాజావార్తలు
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్‌కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్‌లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!