Free Power: రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ మండపాలు, దుర్గామాత మండపాలకు ఉచితంగా విద్యుత్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల ప్రకారం 2025 ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు జరిగే గణేష్ నవరాత్రి వేడుకలకు (11 రోజులు), అలాగే సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే దుర్గామాత నవరాత్రి వేడుకలకు (9 రోజులు) ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని సూపరింటెండింగ్ ఇంజినీర్లు, అకౌంట్స్ అధికారులకు సర్క్యులర్ జారీ చేసింది. మండపాల నిర్వాహకులు రిజిస్ట్రేషన్ స్లిప్‌లను సమర్పించాల్సి ఉంటుంది. ఖర్చు వివరాలు ప్రొఫార్మా-1, ప్రొఫార్మా-2 రూపంలో సమర్పించాల్సిందిగా సూచించారు.
Medipally Murder Case : మేడిపల్లి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి