Telangana Formation Day: రెండేళ్ల తర్వాత.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ముస్తాబైంది. ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. కోవిడ్–19 మహమ్మారితో రెండేళ్ల విరామం తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 9 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. పబ్లిక్ గార్డెన్స్‌కు వెళ్లడానికి ముందు సీఎం కేసీఆర్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వేడుకల్లో భాగంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మంది తెలంగాణ బిడ్డలను గవర్నర్ సన్మానించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దర్బార్ హాల్‌లో అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు, వివిధ రంగాల ముఖ్యుల నుంచి శుభాకాంక్షలు అందుకోనున్నారు.
Also Read
ఢిల్లీలో కూడా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం అధికారికంగా నిర్వహించనుంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!