తెలంగాణ పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలని డిజిపి మహేందర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వర్చువల్ గా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కేసుల విచారణ, దర్యాప్తు, కోర్టులలో శిక్షల శాతం, పెట్రోలింగ్ వాహనాల పనితీరు, స్టేషన్ రైటర్లు, రిసెప్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలతో పాటు వివిధ ఫంక్షనల్ వర్టీకల్స్ అంశాలను సమీక్షించారు. ఈ సమావేశంలో డి.జి.పి మాట్లాడుతూ… దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న…