తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది.. గత బులెటిన్‌తో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో తెలంగాణలో 2,421 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. ఇదే సమయంలో 3,980 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,828కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 7,34,628కి పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,096కి చేరింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 33,104 యాక్టివ్ కేసులు ఉన్నాయిన.. రికవరీ రేటు 95.18 శాతంగా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 81,417 శాంపిల్స్ పరీక్షించగా.. ఇంకా 2,441 శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది.
Read Also: స్కూళ్ల రీఓపెన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇవి పాటించాల్సిందే..!