Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్.. కాంగ్రెస్ పెద్దలతో మూడు అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో ఆయన భేటీ కానున్నారు. ప్రధానంగా మదు సమస్యలపై ఆయన నాయకత్వంతో చర్చిస్తారని తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది ఉండగా.. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత మంత్రివర్గంలో నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. మిగిలిన 6 స్థానాల్లో డజనుకు పైగా సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ఇందులో ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
Read also: Sabarimala: శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ.. అయ్యప్ప దర్శనానికి 16 గంటల సమయం
Also Read
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
- Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం.. ఎయిర్‌పోర్టులో ప్రధాన నిందితుడు అరెస్ట్..
- Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
ఈ క్రమంలో ఈ ఆరు బెర్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వీటిపై ఆసక్తిగా చర్చించనున్నట్లు సమాచారం. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని సోమవారం గాంధీభవన్‌లో జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంక్రాంతి తర్వాత లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. తెలంగాణ నుంచి అగ్రనేత సోనియా గాంధీ పోటీ చేయాలని పీఏసీలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక, సోనియాగాంధీ పోటీ తదితర అంశాలపై సీఎం రేవంత్ అధిష్ఠానం చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రధాని మోదీని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం హోదాలో ఆయనను తొలిసారి మర్యాదపూర్వకంగా కలిసే ఛాన్స్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.
PM Modi: ఓటమి నిరాశతో పార్లమెంట్‌కు అంతరాయం కలిగిస్తున్నారు: ప్రధాని మోడీ
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!