Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
- మెట్రో, ఆర్టీసీకి ఉమ్మడి పాస్‌లు
- డైలీ పాస్ రూ.400.. నెలవారీ రూ.8,500
- ‘మీ టికెట్’ యాప్‌తో డిజిటల్ టికెటింగ్
- ఫోన్లోనే బస్ టికెట్లు, పాస్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం ప్రయాణించే పౌరులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ఒకే పాస్‌తో ప్రయాణించేలా ‘కామన్ పాస్’ (ఉమ్మడి పాస్) విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరికొత్త ఉమ్మడి పాస్ వ్యవస్థతో పాటు అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ (MeeTicket) మొబైల్ యాప్‌ను రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒకే పాస్‌తో రెండు ప్రధాన రవాణా వ్యవస్థల్లో ప్రయాణించే వెసులుబాటు కలగడంతో నగరవాసులకు ప్రయాణ ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా గణనీయంగా ఆదా కానుంది.
రోజువారీ, నెలవారీ జాయింట్ పాస్ ధరలు ఖరారు
ఈ ఉమ్మడి పాస్ విధానంలో భాగంగా ఆర్టీసీ, మెట్రో సర్వీసులను అనుసంధానిస్తూ రోజువారీ , నెలవారీ పాస్‌లను ప్రభుత్వం ఖరారు చేసింది. రోజువారీ జాయింట్ పాస్ ధరను రూ. 400గా నిర్ణయించగా, నెలవారీ జాయింట్ పాస్ ధరను రూ. 8,500గా ఖరారు చేశారు. ఈ జాయింట్ పాస్ ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు , మెట్రో రైళ్లలో సులువుగా ప్రయాణించవచ్చు. నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం నగరం నలుమూలలకూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ పాస్‌లు ఎంతో ప్రయోజనకరంగా మారనున్నాయి.
Also Read
ఆర్టీసీలో ఆన్లైన్ డిజిటల్ టికెటింగ్.. ‘మీ టికెట్’ యాప్ ద్వారా సేవలు
నగర రవాణాలో మరో కీలక మార్పుగా ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కండక్టర్ ప్రమేయం లేకుండా, పేపర్ టికెట్ అవసరం లేకుండా ప్రయాణికులు తమ మొబైల్లోనే నేరుగా టికెట్ పొందేలా ఈ సదుపాయాన్ని రూపొందించారు. అప్‌గ్రేడ్ చేసిన ‘మీ టికెట్’ మొబైల్ యాప్ ద్వారా రోజువారీ టికెట్, డే పాస్‌లతో పాటు ఆర్టీసీ కొత్తగా తెచ్చిన వారం రోజుల పాస్ , నెలవారీ బస్ పాస్‌లను నేరుగా ఫోన్ నుంచే పొందే వెసులుబాటు కల్పించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయాణికులకు వేగవంతమైన, పారదర్శకమైన రవాణా సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సంస్కరణలు చేపట్టింది.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?