CM KCR Delhi Visit: ఢిల్లీలో కేసీఆర్.. రేపు రాష్ట్రపతితో భేటీ.. అమిత్‌షాతో సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హస్తినకు చేరుకున్నారు.. ఇక, రేపటి నుంచి ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా గడపనున్నారు.. మొదటగా మంగళవారం రోజు కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వంగా కలిసి అభినందనలు తెలపనున్నారు.. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రలతో సమావేశం కానున్నారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వరదల వల్ల కలిగిన నష్టాన్ని వివరించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి.. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అధీనంలో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం ఉండడంతో.. ఆయన అమిత్‌షాతో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణలో వరదలు.. వాటివల్ల కలిగిన నష్టం గురించి వివరించనున్నారు. ఇక, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలిసి రాష్ట్రంలో వరదలు సృష్టించిన భీభత్సం గురించి వివరించబోతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్రం విడుదల చేయాల్సిన పెండింగు నిధుల పై కూడా చర్చించనున్నారు.. ఇరువురు కేంద్ర మంత్రుల తో జరిగే భేటీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, పలువురు టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: Sonia Gandhi: రేపు ఈడీ విచారణకు సోనియా గాంధీ.. నిరసనలకు కాంగ్రెస్ సిద్ధం
Also Read
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
- AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
తెలంగాణలో ఇప్పటికే కేంద్ర బృందాలు పర్యటించారు.. వరద వల్ల ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేశాయి.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం కలిగిన విషయం తెలిసిందే.. ఇక, ఎప్పుడూ లేనంతగా కడియం ప్రాజెక్టుకు వరద వచ్చిన విషయం తెలిసిందే.. కాగా, రెండు మూడ్రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు కేసీఆర్.. తన పర్యటనలో విపక్షాలకు చెందిన జాతీయ నేతలను కలవనున్నారు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై.. ఢిల్లీలోనే ఉన్నారు.. ఆమె కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ హస్తిన టూర్ ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల
-
Sugar Price Hike: కొండెక్కుతున్న చక్కెర ధరలు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?