Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- 18 కంపెనీలకు 121 బ్రాండ్లకు అనుమతి
- ఫారిన్ బీర్లు, సింగిల్ మాల్ట్స్కు గ్రీన్ సిగ్నల్
- సెప్టెంబర్ 1 వరకు అభ్యంతరాలకు అవకాశం
- కొత్త బ్రాండ్లతో పాటు ధరల పెంపు చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Liquor : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. త్వరలోనే అంతర్జాతీయ ప్రీమియం మద్యం బ్రాండ్లతో పాటు విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ రకాలు తెలంగాణ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ప్రధానంగా లోకల్, దేశీయ బ్రాండ్లకే పరిమితమైన తెలంగాణ మద్యం మార్కెట్లోకి గ్లోబల్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
18 కంపెనీలు.. 121 కొత్త బ్రాండ్లకు అనుమతి
విదేశీ మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 18 ప్రముఖ కంపెనీలకు చెందిన 121 మద్యం బ్రాండ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వం, సెప్టెంబర్ 1 నాటికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది. నూతనంగా రానున్న బ్రాండ్లలో అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సింగిల్ మాల్ట్ విస్కీలు, హెండ్రిక్స్ జిన్, మంకీ షోల్డర్, టైగర్ లాగర్ బీర్లతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు దేశీయ ప్రీమియం కేటగిరీకి చెందిన ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, రీకో, వల్లోన్ వంటి బ్రాండ్లు కూడా త్వరలోనే షాపులు, పబ్బుల్లో లభించనున్నాయి.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
మరోవైపు కిక్కు దింపే వార్త.. పెరగనున్న మద్యం ధరలు?
ఒకవైపు కొత్త బ్రాండ్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. మద్యం తయారీ వెచ్చించే ఖర్చులు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిసరుకుల ధరల దృష్ట్యా ధరలు పెంచాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, ధరల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక దఫా ధరలు పెంచిన నేపథ్యంలో, మళ్ళీ పెంచితే వినియోగదారుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయినప్పటికీ, కంపెనీల ఒత్తిడి మేరకు రానున్న రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!