CM KCR: రైతులకు అండగా వుంటాం.. మోడీ ఆటలు సాగనివ్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని చెప్పా’ అని తెలిపారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు.
రైతులను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని వారికి ధైర్యం కలిపించారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా వున్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
CM Sri KCR speaking at the event of handing over cheques to bereaved families of farmers and army personnel in Chandigarh. https://t.co/PFt5MldfE5
— Telangana CMO (@TelanganaCMO) May 22, 2022
పంజాబ్ పర్యటనలో కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పాల్గొన్నారు. . చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు కేసీఆర్. పలు అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
Nara Lokesh: దేశంలోనే అత్యధికంగా ఏపీలో ‘వ్యాట్’ బాదుడే బాదుడు
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!