రేపు తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజూరాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. దళిత బంధుని హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఈ మీటింగ్‌లోనే ముహూర్తం ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల పలు దఫాలుగా దళితబంధుపై చర్చలు జరిపిన సర్కారు…ఈ పథకానికి తగిన మార్గదర్శకాలను రూపొందించడం, వీలైనంత తొందరగా అమలులోకి తీసుకురావడం, బడ్జెట్ కేటాయింపులు చేయడం తదితర అంశాలను ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
దళితవాడల్లోని సమస్యలు, అర్హుల జాబితాను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు దళిత బీమాపై కూడా చర్చించనున్నారు.ఇక చేనేతలకు బీమాపై సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన తరుణంలో దానిపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. చేనేత బంధుపై సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సైతం త్వరలో ఈ స్కీం అమలు అవుతుందని స్పష్థం చేశారు. హుజూరాబాద్‌లో ఎస్సీల తర్వాత బీసీ వర్గాల్లో చేనేతల శాతం ఎక్కువగా ఉంది. మరోవైపు 50 వేల ఉద్యోగాల భర్తీ అంశంపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది.
వీటితోపాటు పంటల సాగు, ప్రాజెక్టుల తదితర అంశాలపై చర్చించనుంది. ఇక కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేసిన అంశంపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా కేబినెట్ చర్చించనుంది. జులైలో రెండు సార్లు కేబినెట్ సమావేశం జరిగింది. జూలై 6న మంత్రి వర్గం సమావేశం కాగా..జూలై 13న సమావేశం ఏకంగా రెండు రోజుల పాటు కొనసాగింది. ఈ భేటీల్లో రైతుబంధుతోపాటు వ్యవసాయ సంబంధమైన నిర్ణయాలు తీసుకున్నారు. రేపు మరోసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు..
తాజావార్తలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!