తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను అడుగడుగునా దేశభక్తి భావన, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో మేల్కొలిపే విధంగా సమున్నత స్థాయిలో, అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులు మొదలు కొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు యువతీ యువకులు, యావత్ తెలంగాణ సమాజం ఈ ఉత్సవాలల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని… రాష్ట్రంలోని మొత్తం 1 కోటీ 20 లక్షల గృహాలకు జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేయాలని…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. చివరకు తామే కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.. ఢిల్లీ వేదికగా కేంద్రానికి డెడ్‌లైన్ పెట్టిన తర్వాత రోజు.. కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. తామే వరి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. దానిపై ప్రకటన చేశారు.. ఇక, మరుసటి రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి.. ఈ నేపథ్యంలో.. ఇవాళ వరి కొనుగోళ్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు…
మార్చి నెల వచ్చేస్తోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి నెలరోజులవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తోంది. 2022- 23 రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారుచేయడానికి సీఎం కేసీఆర్.. ప్రగతిభవన్‌లోఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
జల వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయింది.. దీంతో.. ఇవాళ 6 గంటలకు పైగా సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా…
జల జగడం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది.. మాటల యుద్ధం, ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఎవ్వరు అడ్డుకుంటారో మేం చూస్తాం అని కొందరు అంటుంటే.. మేం అడ్డుకునే తీరుతాం అనే విధంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు.. ఇటీవల ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కాకరేపుతున్నాయి.. అయితే, ఇవాళ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. తెలంగాణ సీఎం కేసీఆర్.. నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించిన…
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…