Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ పై సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ శ్వేత ప్రతం ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి చర్యను మొదలు పెట్టారు. రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం సీరియస్ తీసుకోవడం లేదని కడియం మండిపడ్డారు. బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్యలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరని అన్నారు. మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలని తెలిపారు. బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలన్నారు. అందరి కోసం కాదు కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ.. మరో వైపు బయట తిగుతున్నారు అంటూ మండిపడ్డారు.
Read also: Rohit Sharma: ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!
గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అని ప్రశ్నించారు. అభి వృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75 వేలు ఎలా పెడతారు? అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే.. ఎమర్జెన్సీ అనగానే కడియంను మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు. దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే అన్నారు. కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలన్నారు. పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? అని పొన్నం ప్రశ్నించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారని తెలిపారు.
Read also: Sony – Zee : సోనీతో జీ విలీన ఒప్పందం విచ్ఛిన్నం.. భారీగా ఉద్యోగుల తొలగింపు ?
ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలన్నారు. ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పు పట్టారు. ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుందన్నారు. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టు కుంటాం అన్నారు. శ్రీధర్ బాబు మాటలకు కడియం మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారని మండిపడ్డారు. వనరులు చూసుకోకుండా లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా? అని కడియం ప్రశ్నించారు. ఇక మండలిలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలే అవుతుందన్నారు. దళిత బంధు ఇతర పథకాల అమలు, పర్యవసానాలు ఇటీవల ఎన్నికల ఫలితాల్లో ప్రజలు చూపించారని తెలిపారు.
Read also: V Srinivasa Rao: ఉద్దేశపూర్వకంగా రాజధానిపై వివాదం..! ఉమ్మడి రాజధాని అంటే..?
మేము, మా పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. పది సంవత్సరాల తరువాత అనాల్సిన మాటల్ని రెండు నెలల్లోనే బీఆర్ఎస్ నేతలు అంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు వస్తున్న సమస్యలన్నింటికి బీఆర్ఎస్ కారణం అని మండిపడ్డారు. ఇక మండలిలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లను, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంటే బీఆర్ఎస్ నేతలు చూసి ఓర్వలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తింప చేయంటారా? వద్దా? ప్రతిపక్షం చెప్పాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి ఇవ్వలేదని తెలిపారు.
Allari Naresh : పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో రాబోతున్న అల్లరోడు..