Rohit Sharma: ముంబై ఇండియన్స్ భవిష్యత్తు కోసమే కెప్టెన్సీలో మార్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar React on Rohit Sharma Mumbai Indians Captaincy: ఐపీఎల్ 2024 ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఐదు టైటిళ్లను అందించిన రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దాంతో సోషల్ మీడియాలో రోహిత్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్ అభిమానులు ముంబై మేనేజ్మెంట్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆపై కోచ్ మార్క్ బౌచర్ వ్యాఖ్యలు, రోహిత్ సతీమణి రితికా సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. తాజాగా ముంబై కెప్టెన్సీ మార్పుపై టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముంబై టీమ్ భవిష్యత్తు గురించి ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
స్టార్ స్పోర్ట్స్‌తో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ… ‘ముంబై జట్టు భవిష్యత్తు గురించి ఆలోచించింది. రోహిత్ శర్మకు ఇప్పుడు 36 ఏళ్లు. ఇప్పటికే అతడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. భారత జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్నాడు. హిట్‌మ్యాన్‌పై ఉన్న భారాన్ని కొంత తగ్గించాలనే ఉద్దేశంతోనే హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించింది. దీంతో ముంబైతో పాటు రోహిత్‌కు ప్రయోజనం చేకూరనుంది. రోహిత్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. టాప్ ఆర్డర్‌లో హిట్‌మ్యాన్ మరిన్ని పరుగులు రాబడితే జట్టుకు కలిసొస్తుంది. హార్దిక్ మూడు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అప్పుడు ముంబై 200లకు పైగా స్కోరు చేసే అవకాశాలు ఉంటాయి’ అని అన్నాడు.
Also Read
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
- Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
- Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
- Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
Also Read: Valentine’s Day 2024: ‘మిస్టర్ బచ్చన్’ నుంచి స్పెషల్ పోస్టర్.. రవితేజ గట్టిగానే పట్టుకున్నాడే..!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను రికార్డు స్థాయి ధర చెల్లించి మరీ ముంబై ఇండియన్స్ తీసుకుంది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు ప్రకటించిన గంట వ్యవధిలోనే.. ముంబై జట్టు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 4 లక్షల మంది అభిమానులు వీడారు. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉన్నా.. ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు మళ్లీ ఫాన్స్ రచ్చ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక రోహిత్ గత సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 332 పరుగులు చేశాడు. రోహిత్ నాయకత్వంలో ముంబై 87 మ్యాచ్‌లు గెలిచి, 67 మ్యాచ్‌లలో ఓడిపోయింది.
తాజావార్తలు
-
AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
-
TDP : గుంటూరు మేయర్ పీఠంపై టీడీపీ ఫోకస్.. బరిలోకి లక్ష్మీ అపర్ణ..
-
Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?
-
Donald Trump: ఫ్రాన్స్‌లో అల్లర్లు.. వలసదారులే కారణమన్న ట్రంప్, ‘సరిహద్దులు మూసేయండి’ అంటూ పిలుపు!
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!