Telangana Assembly Session: నేటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
- ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సెషన్స్..
- ఈ నెల 25వ తేదీన వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Session: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం 11 గంటలకు స్టార్ట్ కానున్నాయి. శాసనమండలి సమావేశాలు రేపు( జులై 24) ఉదయం 10 గంటలకుయ ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉదయం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు.
Read Also: TGPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం..
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
ఇక, ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అసెంబ్లీలో నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత సభను రేపటికి వాయిదా వేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సభ ఎజెండా, అసెంబ్లీ సెషన్స్ ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు రైతు రుణమాఫీ అంశంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
Read Also: Budget 2024: రైల్వేలో సీనియర్ సిటిజన్స్‌కు గుడ్‌న్యూస్ ఉండే ఛాన్స్!
అలాగే, ఈ నెల 25వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. 26వ తేదీన సమావేశాలకు విరామం ప్రకటించనున్నారు. ఇక, ఈ నెల 27న బడ్జెట్ ప్రసంగంపై చర్చ స్టార్ట్ అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ సభకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత 30వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సెషన్స్ లో స్కిల్స్ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో బడ్జెట్ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేయనుంది.
తాజావార్తలు
-
Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
-
Rajnath Singh: హైదరాబాద్‌కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
-
ICC సంచలన నిర్ణయం.! మహిళల టీ20 ప్రపంచకప్ విజేతకు భారీగా నగదు బహుమతి ప్రకటన.!
-
AIR INDIA Crash: ఆ మూడు సెకన్లలో అసలేం జరిగింది? విమానం కూలి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలు!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
ట్రెండింగ్
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!