Madvi Hidma: మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా అరెస్ట్ అయ్యారు. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో హిడ్మాని పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్ట్ ఆపరేషన్స్‌లో హిడ్మా చాలా కీలకం. హిడ్మా సొంతూరు ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా. మావోయిస్ట్ గెరిల్లా వార్‌ఫేర్‌లో మాస్టర్ మైండ్‌గా చెబుతారు. ఇటీవల మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ చీఫ్ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత హిడ్మా అరెస్ట్ కావడంతో దాదాపుగా దేశంలో మావోయిజం అంతమైనట్లు భావిస్తున్నారు.
హిడ్మా టార్గెట్ గా ఛత్తీస్ ఘడ్, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది. హిడ్మా లోంగిపోయాడంటు పోలీసులు ఓ ప్లాన్ ప్రకారం ప్రచారం చేస్తున్నారని మావోయిస్ట్ పార్టీ అంటుంటే.. అలా చేయాల్సిన అవసరం తమకు లేదంటున్న పోలీసులు వెల్లడిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ రెండు రాష్ట్రాల్లో హిడ్మా లోంగిపోయారంటు వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏమి జరుగుతుందేమోనని మావోయిస్ట్ పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇటీవలే మావోయిస్ట్ పార్టీ మిలిషియస్ సభ్యుడు మాడవి హిడ్మా లొంగిపోయాడు.…