Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- వికసిత్ భారత్ సదస్సులో తెలంగాణ విజన్
- 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం
- కేంద్రం, రాష్ట్రాల భాగస్వామ్యంతోనే అభివృద్ధి
- తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌తో భవిష్యత్ ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్’ ఆర్థిక సదస్సు ఘనంగా నిర్వహించబడింది. 2047 నాటికి భారతదేశం సాధించాల్సిన సమగ్ర ఆర్థిక వృద్ధి, ఆ దిశగా వివిధ రాష్ట్రాలు పోషించాల్సిన పాత్ర , అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమీక్షా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరై, రాష్ట్ర ప్రభుత్వ విజన్ , ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా వివరించారు.
2047 నాటికి $3 ట్రిలియన్ల ఎకానమీ సాధనే తెలంగాణ ధ్యేయం
ఈ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సంబంధించి తమ ప్రభుత్వ ప్రణాళికలను సభ దృష్టికి తీసుకెళ్లారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే 2025 డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని, దానికి అవసరమైన సమగ్ర ప్రణాళికలు , విధానాలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
‘వికసిత్ భారత్’ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ భాగస్వామ్యమే
వికసిత్ భారత్ భావనపై మాట్లాడిన భట్టి విక్రమార్క, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పరిమితమైన అంశం కాదని స్పష్టం చేశారు. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని, ప్రతి రాష్ట్ర అభివృద్ధి ఇందులో భాగమేనని గుర్తుచేశారు. కేంద్రం , అన్ని రాష్ట్రాల సమగ్ర సహకారం, సమిష్టి భాగస్వామ్యంతోనే దేశం అనుకున్న ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించగలదని ఆయన ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
-
Vijay Sethupathi: సీఎం విజయ్ ఫోన్ చేశాడు.. ఆ సీక్రెట్ కాల్ ముచ్చట్లు బయటపెట్టిన సేతుపతి..!
-
Punjab: మాజీ కేంద్ర మంత్రి అరెస్ట్.. పంజాబ్‌లో హై-వోల్టేజ్ డ్రామా..
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!