Telangana Congress: టీ కాంగ్రెస్ మరో కీలక కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. యువత ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. ఈ యాత్ర రేపటి నుంచి (ఈ నెల 5) నుంచి అంటే ప్రారంభం కానుంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా టీకాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే టీ కాంగ్రెస్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కీలకమైన యువత ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువ పోరాట యాత్ర నిర్వహిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, యువత సమస్యలను తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వంలో వారికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Read also: Ajay Devgn: 45 కోట్లతో కొత్త ప్లాట్.. అజయ్ దేవగన్ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారో తెలుస్తే షాక్
యువ పోరాట యాత్రలో భాగంగా ఇప్పటికే ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఈ డిక్లరేషన్‌లో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యువత కోసం ఎలాంటి పథకాలు చేపట్టనున్నారనే వివరాలను పొందుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, యువతులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించడం వంటి పలు కీలక హామీలను ఆయన ప్రకటించారు. ఈ హామీలను కాంగ్రెస్ ప్రచారం ద్వారా యువతకు చేరవేయనుంది. ఈ యాత్ర ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది.
తెలంగాణలో యువ ఓటర్లు కీలకంగా మారారు. యువతను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. నిరుద్యోగుల సమస్యలపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. నిరుద్యోగ గర్జన పేరుతో కాంగ్రెస్ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించింది. ఈ సమావేశాలకు భారీ స్పందన రావడంతో ఇప్పుడు ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఈ యాత్ర ద్వారా యువతను పార్టీ వైపు తిప్పుకోవాలని యోచిస్తోంది. ఈ నెలాఖరు వరకు ప్రచారం కొనసాగుతుందని తెలుస్తోంది.