Tarun Chugh On KCR: కుటుంబంలో ఒక్కో ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్. వికారాబాద్ జిల్లా బీజేపీ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో 420లు ఉన్నారు. తెలంగాణలో బీజేపీ సునామీ రావడం ఖాయం… ఆపే వాళ్లు ఎవరూ లేరు. కేసీఆర్ ఆశలు గాలిలో మేడల్ల కూలిపోవడం ఖాయం అన్నారు.
బీజేపీ కార్యకర్తలు సమిష్టిగా పోరాడాలి.. కేసీఆర్‌ను గద్దె దించాలి. అవినీతి కుటుంబ పాలనను ఓడించి అంతా కలిసి ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడాలన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ విశ్వాస ఘాతుకం నుండి ప్రజలను కాపాడాలి. ప్రజాస్వామ్యయుతంగా కుటుంబ అవినీతి పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు గల్లీ గల్లీ, వార్డ్ వరకు , శక్తి కేంద్రం వరకు వెళ్లి అందరినీ సంఘటితం చేయాలి. బీజేపీ ఎలా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుందో చెప్పాలి.
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ప్రజలకు న్యాయం చేసేందుకు బీజేపీ అతి పెద్ద ఆందోళన చేపట్టబోతోంది. అందరికీ న్యాయం జరిగేలా చేస్తాం. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ సర్కార్ మోసం చేసింది. తెలంగాణ వస్తే బ్రతుకులు బాగుపడతాయని కేసీఆర్ చెప్పారు. ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ అమలు చేయలేదు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం అన్నీ దక్కాయి. తెలంగాణ కోసం అనేక మంది యువకులు బలిధానం చేసుకున్నారు .. కానీ లబ్దిమాత్రం కల్వకుంట్ల కుటుంబానికే దక్కింది.
లాఠీ దెబ్బలు యువకులు తింటే .. లబ్దిమాత్రం అమరికా నుండి వచ్చిన కేటీఆర్ కు దక్కింది. తెలంగాణ ఉద్యమంతో కనీసం సంబంధం లేని పదిమంది తెలంగాణలో అధికారం చెలాయిస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేకుండా చేసాడు. సర్కార్ లో ఉన్నాం కాబట్టి టీఆర్ఎస్ లో ఉన్నాం అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. పార్టీలో కనీసం స్వేచ్చగా గాలి పీల్చే పరిస్థితి లేదంటున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్.
తెలంగాణ అభివృద్ది కోసం కాదు.. రాష్ట్రంను దోచుకునేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు పార్టీని విడిచి పెట్టాలని చూస్తున్నారు. ఏ గ్రామంలో సామాన్యుడిని అడిగినా ఇది దొంగ ప్రభుత్వం .. ప్రజల కలల పట్ల విశ్వాస ఘాతుకం చేసాడు అని చెబుతారు. తెలంగాణలో రైతులు, యువకులు, మహిళలు, దళితులు నారాజ్ లో ఉన్నారు.. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. మంత్రులపై ముఖ్యమంత్రి కిచెన్ క్యాబినెట్ పెత్తనం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కాకుండా మరింత మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కుటుంబంలో ఒక్కో విభాగానికి ఒక్కో ముఖ్యమంత్రి ఉన్నారు.. వారంతా దోచుకునేందుకు ఆలోచనలు చేస్తుంటారు అని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!