Uttam Kumar Reddy: నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండి ని వారం రోజుల్లో పూర్తి చేస్తాం..
- రాష్ట్ర వ్యాప్తంగా 10000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా..
- రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం..
- రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం 132 కిలోమీటర్ వద్ద ఎడమ కాలువకు గండి పడింది. దీంతో గండి పడిన ప్రాంతంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గండి పూడ్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం 2.10 కోట్ల రూపాయలు ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10000 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖకు 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు.
Read also: Warangal Traffic: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. వరంగల్ సీపీ కీలక సూచన..
Also Read
యుద్ధ ప్రాతిపదికన కాలువలు చెరువులు పంప్ హౌస్ లను మరమ్మత్తులు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది రైతులకు నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ గండిని వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాత్రి పగలు పనిచేసే గంటని పూడ్చే విధంగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. వరద నష్టాన్ని కేంద్రానికి నివేదిక అందించామన్నారు. కేంద్ర సహాయం కోసం వేచి చూడకుండా.. యుద్ధ ప్రాతిపదికను పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. కేంద్ర సాయం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read also: Breaking News: తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత..
మరోవైపు ఎడమ కాల్వ వెంబడి చాలా చోట్ల కాల్వ లైనింగ్, కట్టలు కోతకు గురికావడంతో వరద ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాద్గారపల్లి మేజర్ పరిధిలోని మిర్యాలగూడ మండలం ఐలాపురం, వేములపల్లి మండలం అన్నపరెడ్డిగూడెం మధ్య దాదాపు 3.5 కిలోమీటర్ల మేర లైనింగ్ దెబ్బతిన్నది. నడిగూడెం మండలం రామాపురం, చాకిరాల, సిరిపురం, కహిరారామచంద్రాపురం గ్రామాల సమీపంలో కాలువ కట్టలు దెబ్బతిన్న విషయం తెలిసిందే..
స్నానానికి సబ్బు వద్దు.. సున్నిపిండి బెటర్..
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!