Team India Histroy: టీ20 క్రికెట్లో భారత్ వరల్డ్ రికార్డు.. ఇక ఆస్ట్రేలియా అందుకోలేదుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India World Record in T20 Cricket: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 127 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 221 పరుగులు చేయగా.. భారీ లక్ష్య ఛేదనలో అఫ్గాన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్ల ధాటికి 14.1 ఓవర్లలో కేవలం 94 పరుగులకే ఆలౌటయ్యారు. ఈ భారీ విజయంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా అరుదైన ఘనతను అందుకుంది.
పురుషుల టీ20ల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధిక విజయాలు సాధించిన టీమ్స్ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. భారత్ ఇప్పటివరకు 10 సార్లు భారీ విజయాలను నమోదు చేసింది. కెనడా కూడా 10 సార్లు 100కు పైగా పరుగుల తేడాతో గెలిచి.. భారత్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20కి ముందు కెనడా అగ్రస్థానంలో ఉండగా.. 127 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్ మొదటి స్థానంలోకి దూసుకొచ్చింది. ఈ జాబితాలో ఆస్ట్రియా 9 విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే, నేపాల్, జపాన్, మలేషియా, ఉగాండా జట్లు ఎనిమిది చొప్పున భారీ విజయాలు సాధించాయి.
Also Read
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
- Hanuma Vihari : ఆడకున్నా అవకాశాలు ఇస్తారా, ఇంకెంతకాలం జట్టులో ఉంటాడు.. హనుమ విహారి కీలక వ్యాఖ్యలు!
స్పెయిన్, టాంజానియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, డెన్మార్క్ జట్లు ఆరు చొప్పున 100కు పైగా పరుగుల తేడాతో టీ20ల్లో విజయాలు నమోదు చేశాయి. పపువా న్యూ గినియా ఐదు విజయాలతో తర్వాతి స్థానంలో ఉంది. ఈ జాబితాలో టాప్ జట్లు, ప్రపంచ ఛాంపియన్స్ లేకపోవడం విశేషం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్తాన్, న్యూజీలాండ్, దక్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లు 100కు పైగా పరుగుల తేడాతో పెద్దగా విజయాలు అందుకోలేదు. ముఖ్యంగా ఆ మధ్య ప్రపంచ క్రికెట్‌ను ఏలిన ఆసీస్.. ఈ జాబితాలోనే లేదు. ప్రస్తుతం టీమిండియా హవా నడుస్తున్న ఈరోజుల్లో.. ఇక ఆస్ట్రేలియా మన రికార్డును అందుకోవడం దాదాపు అసాధ్యమే.
ఇక 127 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఎదురైన ఓటమి అఫ్గానిస్థాన్ టీ20 చరిత్రలోనే అత్యంత భారీ పరాజయంగా నిలిచింది. ఇప్పటివరకు అఫ్గాన్‌కు అత్యధిక ఓటమి 116 పరుగులే. 2012లో కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 116 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. 2024లో వెస్టిండీస్ చేతిలో 104 పరుగుల తేడాతో, 2022లో భారత్ చేతిలో 101 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. 2025లో షార్జాలో పాకిస్థాన్‌పై 75 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇప్పుడు ఢిల్లీలో 127 పరుగుల ఓటమితో అఫ్గానిస్థాన్ తన చెత్త రికార్డును తానే అధిగమించింది.
ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ 94 పరుగులకే ఆలౌట్ కావడం కూడా మరో చెత్త రికార్డుగా నిలిచింది. భారత్‌పై అఫ్గానిస్థాన్ టీ20ల్లో చేసిన అత్యల్ప స్కోరు ఇదే. ఇంతకుముందు భారత్‌పై అఫ్గాన్ అత్యల్ప స్కోరు 111/8. 2022లో దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో ఆ జట్టు 111 పరుగులు చేసింది. ఢిల్లీలో 94 పరుగులకే ఆలౌట్ కావడంతో.. అఫ్గానిస్థాన్ తన గత అత్యల్ప స్కోరు కంటే కూడా 17 పరుగులు తక్కువ చేసింది. భారత బ్యాటర్లు భారీ స్కోరు సాధించడంతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణించడంతో టీమిండియా 127 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
తాజావార్తలు
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
-
Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
-
Kitchen Sink Tips: గిన్నెలు తోమేటప్పుడు బట్టలు తడుస్తున్నాయా? రూపాయి ఖర్చు లేకుండా ఈ 5 ట్రిక్స్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!