Students Struggle For Bus: బస్సుల కోసం విద్యార్థులు రోడ్డెక్కారు. సమయానికి బస్సులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీలకు వెల్లేందుకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొనవలసి వస్తుందని వాపోతున్నారు. ఇలా రోజు జరిగితే ఎలా? అంటూ ప్రశ్నింస్తున్నారు. పాసులు వున్నా ఫలితం లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్లె వెలుగు బస్సులు ఒకటి రెండు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోవడంతోనే బస్సుకోసం రోడ్డెక్కాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లో చోటుచేసుకుంది.
Read also: Tiger Route Changed: మహారాష్ట్రకు మకాం మార్చిన కొత్త పులి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లోని కళాశాలలకు వచ్చే ఎన్.ఎస్.యు.ఐ.విద్యార్థులకు ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ అనిల్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మెహిదీపట్నం నుంచి శంకర్ పల్లి రూట్ లో హైదరాబాద్ టు డిపో అధికారులు మెదీపట్నం డిపో అధికారులు బస్సులు నడిపిస్తుంటారు. విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు ఇచ్చే బస్వాసులు పల్లె వెలుగు బస్సుల్లో మాత్రమే అనుమతిస్తారని తెలిపారు. పల్లె వెలుగు బస్సులు రెండు మూడు మినహా ఎక్కువ బస్సులు లేవు దీంతో కళాశాలలకు రావాలంటే సమయానికి రాలేకపోతున్నారని అన్నారు. మెట్రో బస్సులు ఉన్నప్పటికీ పాసులు అనుమతించకపోవడంతో సమయానికి పల్లె వెలుగు బస్సులు లేకపోవడం కళాశాలకు ఆలస్యంగా రావడంతో నిత్యం నరకం అనుభవించాల్సి వస్తుందని అన్నారు. దీంతో శంకర్పల్లి బస్టాండ్ లో కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పల్లె వెలుగు బస్సులు పెంచాలని కోరుతున్నారు. లేకుంటే మెట్రో బస్సుల్లో పల్లె వెలుగు పాసులు అనుమతించాలని కోరుతున్నారు.
Russia-Ukraine War: మరోసారి బయటపడ్డ రష్యా అరాచరకాలు.. ఖేర్సన్‌లోనూ రిపీట్