Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
- డీజీపీ సీవీ ఆనంద్ చేతుల మీదుగా ‘స్త్రీ రైడ్’ ప్రారంభం
- 55 మంది మహిళలకు ప్రత్యేక శిక్షణ, డ్రైవింగ్ లైసెన్సుల పంపిణీ
- Movo Fleet App ద్వారా మహిళలకు సురక్షిత ప్రయాణ సేవలు
- అత్యవసర పరిస్థితుల్లోనూ అందుబాటులో ఉండనున్న లేడీ రైడర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stree Ride : మహిళల భద్రత, వారి స్వయం ఉపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఒక సరికొత్త వినూత్న ప్రాజెక్టును అందుబాటులోకి తెచ్చింది. ‘స్త్రీ రైడ్’ (Stree Ride) పేరుతో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ డీజీపీ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ర్యాపిడో తరహాలోనే మహిళల కోసం మహిళా డ్రైవర్లనే అందుబాటులోకి తెస్తూ ‘మోవో ఫ్లీట్ యాప్’ (Movo Fleet App) ద్వారా ఈ సేవలను ప్రారంభించారు. దీనివల్ల ఇకపై యువతులు, మహిళలు ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా ప్రయాణించే వెసులుబాటు కలగనుంది.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ.. లైసెన్సుల పంపిణీ
Also Read
మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు, వారు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా (స్వయం ఆధారిత జీవనం) ఈ సురక్షిత రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా తొలి విడతలో 55 మంది మహిళలను ‘స్త్రీ రైడర్లు’గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 55 మందికి అంబర్పేట్ పోలీస్ లైన్స్‌లో విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో టూ వీలర్, త్రీ వీలర్ , ఫోర్ వీలర్ వాహనాలను నడపడంలో ప్రత్యేక డ్రైవింగ్ నైపుణ్యాల శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా రైడర్లకు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను సైతం అందజేశారు.
మహిళల సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాధారణంగా మహిళలు లేదా యువతులు ప్రైవేట్ రైడింగ్ యాప్స్ ద్వారా బైక్ లేదా కార్లను బుక్ చేసుకున్నప్పుడు, పురుష డ్రైవర్ల వల్ల కొన్నిసార్లు అసౌకర్యానికి లేదా ఇబ్బందులకు గురవుతున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగానే ‘స్త్రీ రైడ్’ ప్రాజెక్ట్ పుట్టుకొచ్చింది. ఇకపై మహిళలు తమ ప్రయాణాల కోసం ‘Movo Fleet App’ డౌన్లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకుంటే, మహిళా డ్రైవర్లే వచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు.
అత్యవసర పరిస్థితుల్లోనూ సేవలు: లేడీ రైడర్స్
ఈ సందర్భంగా పలువురు మహిళా రైడర్లు మీడియాతో మాట్లాడుతూ.. “పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా మేము సైతం టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను నడుపుతాం. మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు, సెల్ఫ్ డిఫెన్స్ (ఆత్మరక్షణ) విషయంలో కూడా విమెన్ సేఫ్టీ వింగ్ మాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. కేవలం రవాణా కోసమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు తక్షణ సేవలు అందించడానికి కూడా స్త్రీ రైడర్లుగా మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ప్రయాణికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ, సరికొత్త ఉపాధి మార్గాన్ని చూపిన ప్రభుత్వానికి, పోలీసు శాఖకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
తాజావార్తలు
-
Suriya : ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా సూర్య 50?
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!