TS SSC Results: ఏప్రిల్ 10వ తేదీ బుధవారం 10వ తరగతి ఫలితాలు విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.అయితే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో డిబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో హన్మకొండ పేపర్ లీక్ కేసులో హరీష్ అనే విద్యార్థి ఫలితాలను అధికారులు నిలిపివేశారు. దీంతో తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు.
Read also: Weather: తీవ్ర తుఫానుగా మోచా.. తెలుగు రాష్ట్రాలపై ఎఫెక్ట్
తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. హన్మకొండలో హరీష్ అనే విద్యార్థి హిందీ ప్రశ్నపత్రం లీకేసు వ్యవహారంలో నిందితుడుగా ప్రత్యక్షమయ్యాడు. అతడిపై పదో తరగతి బోర్డు సీరియస్ అయింది. అప్పట్లో కోర్టు సాయంతో హరీష్ మళ్లీ పరీక్షలు రాశాడు. అయితే తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లో హరీష్ విషయంలో అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. దీంతో విద్యార్థి, అతని తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో ఎంజేపీ విద్యార్థి హరీష్ దండెబోయిన 10వ తరగతి చదువుతున్నాడు. నిందితుడు అతడి నుంచి హిందీ పరీక్ష పేపర్ ఫొటోలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు హరీశ్‌ను ఐదేళ్లపాటు పరీక్షలకు హాజరుకాకుండా డిబార్ చేశారు.
దీనిపై అతని తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు విధించిన డిబార్‌ను ఎత్తివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరీక్షలు రాయడానికి అనుమతించారు. హరీష్ కూడా గత పరీక్షల హాల్ టికెట్ నంబర్ తోనే పరీక్షలు రాశాడు. కానీ నిన్న విడుదలైన ఫలితాల్లో హరీష్ రిజల్ట్ పెండింగ్ లో పడింది. మరోవైపు విద్యార్థి హరీశ్ ఫలితాలు వాయిదా పడడంతో ఎన్‌ఎస్‌యూఐ విభాగం నేతలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. విద్యార్థి హరీష్ ఫలితాలు ప్రకటించాలని ఇంద్రారెడ్డికి సబిత వినతిపత్రం అందజేశారు.అయితే వీటిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఉత్కంఠంగా మారింది. సబితా ఇంద్రారెడ్డి నిర్ణయంతో విద్యార్థి భవిష్యత్ ఆధారపడి ఉండటంతో తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు. పిల్లల భవిష్యత్తు పరిగణలో తీసుకుని తనకుమారిడి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నారు.
WhatsApp scam: బీ అలర్ట్.. వాట్సప్ కాల్స్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి