Weather: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా మారిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కొంత సేపటికి వాయువ్య దిశగా పయనించి ఆ తర్వాత ఉత్తర వాయువ్య దిశగా పయనించి క్రమంగా బలపడి ఇవాల సాయంత్రానికి తుపానుగా మారుతుందని వెల్లడించింది. ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తున్నదని, ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. రేపు (12వ తేదీ) ఉదయం మళ్లీ క్రమంగా బలపడి, ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత దిశను మార్చుకుని ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి క్రమంగా బలహీనపడి 14వ తేదీ మధ్యాహ్నం 110-120 వేగంతో కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యుక్ప్యూ (మయన్మార్) వద్ద తీరం దాటే అవకాశం ఉంది.
ఇది తెలంగాణపై ప్రభావం
దీని ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నేటి నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, రాష్ట్రంలోని కొన్ని చోట్ల దాదాపు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో ఇలా
“ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో పొగమంచు ఉదయం సమయంలో ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు మరియు 28 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. వాయువ్య దిశ నుండి గాలులు గంటకు 4 నుండి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్ పేర్కొంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 36.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 61 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా పొడి వాతావరణం ఉంటుంది. రానున్న మూడు రోజుల పాటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి రెండు చోట్ల సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో ముగ్గురికి బెయిల్.. నిందుతుల పాస్‌పోర్ట్ సీజ్