South Central Railway: ప్రయాణికులు ఎలాంటి టెన్షన్ లేకుండా సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకోవాలంటే రైలు ప్రయాణమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.. అందుకే చాలా మంది ప్రయాణికులు ఈ రైలు ప్రయాణానికే ఇష్టపడతారు. కానీ, ఇటీవలి కాలంలో ఈ రైల్వే శాఖకు సంబంధించి కొన్ని వార్తలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. రైల్వే ప్రమాదాలు, రైళ్ల రద్దు వంటి వార్తలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే పలు ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు, రైల్వే స్టేషన్ల నిర్మాణాల కారణంగా ఆయా ప్రాంతాల గుండా వెళ్లే రైళ్లను దారి మళ్లించడంతోపాటు కొన్ని రైళ్లను రద్దు చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ముఖ్యమైన అప్‌డేట్‌లను జారీ చేస్తుంది. ఈ క్రమంలో పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తాజాగా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Read also: Hyderabad Metro: నిలబడేందుకు చోటులేదు.. మెట్రోలో కోచ్ లు పెంచండి..
తాజాగా దక్షిణ మధ్య రైల్వే శాఖ మూడు రోజుల పాటు పలు మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేసింది. కాగా, నేటి నుంచి అంటే ఆగస్టు 17 నుంచి 19 వరకు తిరుపతి-కాచిగూడ, కాకినాడ టౌన్-సికింద్రాబాద్- -కాకినాడ టౌన్, నర్సాపూర్- -సికింద్రాబాద్- -నర్సాపూర్ రైళ్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తెలిపింది. ఆయా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయంగా ఇతర రైళ్లలో ప్రయాణించాలి. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. లేదంటే ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు స్వాతంత్య్ర దినోత్సవ ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
Ponnam Prabhakar: కూల్సుంపుర పాఠశాలను సందర్శించిన పొన్నం ప్రభాకర్..