Soyam Bapurao: ఇదేం ట్రిపుల్ ఐటీ…? ఏంటీ దుస్థితి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్ ను నిర్దేశించే బాసర ట్రిపుల్ ఐటీ విశ్వవిద్యాలయ పరిస్థితిని చూస్తే తీవ్ర ఆవేదన కలుగుతోందన్నారు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ట్రిపుల్ ఐటీ నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ లేరు. విద్యార్థుల సంఖ్యకు సరిపడా ప్రొఫెసర్లు, లెక్చరర్లు లేరు.
ల్యాబ్ అసిస్టెంట్ తో పాఠాలు చెప్పించే దుస్థితి నెలకొంది. వేలాది మంది విద్యార్థులన్న ఈ విశ్వవిద్యాలయంలో ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ కొనసాగుతుండటం ఆశ్చర్యమేస్తోంది. విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాల్లేవు. రేకుల షెడ్లలో పాఠాలు చెబుతున్నారు. ఫ్యాన్లు లేవు. ఏసీ పని చేయడం లేదు. కుర్చీలు డిజిటల్ బోర్డ్స్, డెస్క్ లన్నీ చెడిపోయాయి. ప్రొజెక్టర్ అసలు పనిచేయడం లేదన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మండుటెండలో రేకుల షెడ్లలో ఫ్యాన్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు అల్లాడిపోతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడం లేదు. కనీసం యూనిఫాం, షూ, ఐడీ కార్డులు కూడా ఇవ్వడం లేదంటే ట్రిపుల్ ఐటీ ఎంతటి దుస్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక హాస్టల్ లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. వాడిపారేసిన పాత పరుపులే దిక్కు. 9 వేల మంది విద్యార్థులకు మూడు మెస్ లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా అత్యంత దరిద్రంగా మారాయి.
వేలాది మంది పిల్లలు ఒకేసారి భోజనం చేయాల్సి రావడంతో వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారింది. చదువుకునే వారంతా పేద విద్యార్థులు, గ్రామీణ ప్రాంతం వారేకదా వాళ్లు ఏ భోజనం పెట్టినా అడిగే వారెవరు ఉండరనే నిర్లక్ష్యం మెస్ నిర్వాహకుల్లో కన్పిస్తోందన్నారు. అందుకే వారు వడ్డించే భోజనంలో తెల్ల పురుగులు, కప్పలు కన్పించడం నిత్యకృత్యంగా మారిందన్నారు.
తాగడానికి మంచి నీరు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. పురాతనమైన వాటర్ ఫిల్టర్ నిర్వహణ కూడా సరిగా లేదు. హాస్టల్ లో శుభ్రత కరువైంది. దోమలు, ఈగలు, పురుగులతోనే విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన చెందారు. ఫీజుల ద్వారా ఏటా 40 కోట్ల రూపాయలకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నా విశ్వవిద్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం.
ట్రిపుల్ ఐటీ దుస్థితిని చూస్తుంటే వేలాది మంది విద్యార్థులు భవిష్యత్ ఏమవుతుందోననే ఆవేదన కలుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించరానిది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రెగ్యులర్ వీసీ, డైరెక్టర్ తోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులన్నీ భర్తీ చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. లేనిపక్షంలో బీజేపీ పక్షాన తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని హెచ్చరించారు ఎంపీ సోయం బాపూరావు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!