రైల్వే ప్రయాణికులకు అప్రమత్తం కావాల్సిన సమయంలో… ఇవాళ్లి నుంచి రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్ సేవలతో పాటు.. పలు సేవలకు తాతాల్కికంగా బ్రేక్ పడనుంది.. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహించనున్న కారణంగా.. చార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్‌ఎస్ ఎంక్వైరీ, టికెట్ రద్దు, చార్జీలు రీఫండ్ తదితర పీఆర్‌ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోతాయని తెలిపింది దక్షిణమధ్య రైల్వే అధికారులు. ఇవాళ రాత్రి 11.45 గంటల నుంచి ఆదివారం తెల్లవారు జాము వరకు.. ఈ సేవలకు అంతరాయం కలుగుతుందని.. తిరిగి 22వ తేదీన రాత్రి 11.45 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. ఆయా సమయాల్లో ప్రారంభమయ్యే అన్ని రైళ్ల మెయిన్ చార్టులు, కరెంట్ బుకింగ్ చార్టులు ముందుగానే సిద్ధం చేస్తామని తెలిపారు అధికారులు.