BRS MLCs In Congress: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు..
- కాంగ్రెస్లోకి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు..
- పార్టీలో చేరిన దండె విఠల్.. భానుప్రసాద్ రావు.. ఎంఎస్.ప్రభాకర్.. బొగ్గారపు దయానంద్.. ఎగ్గే మల్లేశం.. బస్వరాజు సారయ్య..
- సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS MLCs In Congress: బీఆర్‌ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్న తర్వాత జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో వారిని హస్తం పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల్లో బస్వరాజు సారయ్య, భానుప్రసాదరావు, ఎగ్గె మల్లేశం, ఎం.ఎస్.ప్రభాకర్, దండె విఠల్, బొగ్గారపు దయానంద్ ఉన్నారు.
Read Also: Assam Flood: అస్సాంలో భారీ వరదలు.. 29జిల్లాల్లో 21 లక్షల మందికి నిరాశ్రయులు.. ఆరుగురి మృతి
Also Read
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
- Komatireddy Venkat Reddy : పవన్‌కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
కాగా, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆరుగురు ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించారు. వాస్తవానికి అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్సీల చేరికపై గత నెలలోనే జోరుగా చర్చలు జరిగాయి. వీరంతా వారం రోజుల ముందే పార్టీలో చేరాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
అయితే, మరోవైపు ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఒకవైపు ఆషాఢమాసం వస్తుండటంతో ఆషాఢ అమావాస్యకు ముందురోజు రాత్రి వీరంతా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం ఏకంగా 12కు చేరింది. కాగా, సీఎం నివాసానికి చేరుకోవడానికి ముందు ఆరుగురు ఎమ్మెల్సీలు దస్‌పల్లా హోటల్‌లో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.
తాజావార్తలు
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
-
Layoffs: జాబ్స్‌కు రెడ్ అలెర్ట్.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయ్..? కాగ్నిజెంట్ నివేదికలో ఏముంది?
-
Pawan Kalyan: “రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా”.. తెలంగాణపై మరోసారి స్పందన.!
-
KTR: “తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా”.. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
-
IRUMUDI Glimpse : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్.. రవితేజకు హిట్ గ్యారంటీ
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!