TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసుపై సిట్ నివేదిక.. అతడే కీలక సూత్రధారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SIT Report On TSPSC Paper Leak Scam: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో రాజశేఖరే కీలక సూత్రధారి అని సిట్ తేల్చింది. ఈ పేపర్ లీక్ కేసులో TSPSCకి ఇచ్చిన నివేదికలో సిట్ కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్ ఈ పేపర్‌ని లీక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. టెక్నికల్ సర్వీస్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన రాజశేఖర్.. ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడని ఆ నివేదికలో తెలిపారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్.. కంప్యూటర్‌ని హ్యాక్ చేసి, పాస్‌వర్డ్‌ని దొంగిలించాడని తేల్చారు. తాను పాస్‌వర్డ్‌ని ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మి చెప్పిన నేపథ్యంలోనే.. కంప్యూటర్‌న హ్యాక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్ కాపీ చేసి.. ఆ పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కి ఇచ్చాడని చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన ఏఈ పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేశాడని, ఆ పేపర్‌ను రేణుకకు ప్రవీణ్ అమ్మాడని వెల్లడించారు. ఇదే సమయంలో గ్రూప్-1 పరీక్షాపత్రం కూడా లీకైనట్టు సిట్ గుర్తించింది. అలాగే.. ప్రవీణ్‌కి గ్రూప్-1లో 103 మార్కులు ఎలా వచ్చాయన్న విషయంపై ఆరా తీస్తున్నారు. సెక్రటరీ దగ్గర ప్రవీణ్ పీఏగా చేస్తూ.. గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు నిర్ధారించారు. మరోవైపు.. ఈ పేపర్ లీక్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల కస్టడీని నాంపల్లి కోర్టు విధించింది. నిందితుల్ని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సిట్ పిటిషన్ వేయగా.. ఆరు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో.. నిందితులను మార్చి 18వ నుంచి 23వ తేదీ నుంచి సిట్ అధికారులు విచారించనున్నారు.
Tarun Chugh: కేసీఆర్ మోసాన్ని బీజేపీ నగ్నంగా బయటపెడుతుంది.. తరుణ్ చుగ్ ప్రకటన
Also Read
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
కాగా.. ప్రవీణ్‌తో ఉన్న సాన్నిహిత్యంతో తన సోదరుడి కోసం రేణుక అనే యువతి ప్రశ్నాపత్రం కోరగా, అతడు నేరుగా ఆమె వాట్సప్ నెంబర్ పేపర్‌ని పంపించాడు. ఈ పేపర్‌ని తన సోదరుడికి పంపగా.. అతడు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించాడు. భారీ మొత్తం పుచ్చుకొని, తన సన్నిహితులకు పేపర్‌ని లీక్ చేశాడు. అయితే.. ఓ యువకుడితో డబ్బుల విషయంలో తేడాలు ఏర్పడ్డాయి. దాంతో కోపాద్రిక్తుడైన ఆ యువకుడు.. పోలీసులకు ఫోన్ చేసి, ఈ పేపర్ లీక్ విషయాన్ని చెప్పేశాడు. అలా.. ఈ టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసుని విచారిస్తున్న సిట్ అధికారులు.. నిందితుల్ని కస్టడీలోకి తీసుకొని, రాజశేఖర్‌ని కీలక సూత్రధారిగా తేల్చారు.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!