Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sooraj Pancholi: బాలీవుడ్ నటి జియా ఖాన్ 2013 జూన్ 3న ముంబైలోని జుహులో ఉన్న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసందే. 25 ఏళ్ల వయసులోనే ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి ముందు రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా, నటుడు సూరజ్ పంచోలీతో ఉన్న ప్రేమ సంబంధంలో తలెత్తిన మానసిక వేదనలే దీనికి కారణమని విచారణలో తేలింది. ఈ కేసులో సూరజ్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చినప్పటికీ, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో 2023 ఏప్రిల్‌లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.
అయితే ఇప్పటికీ తనపై అనుమానాలు వ్యక్తం చేయడం, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం కావడం తనను తీవ్రంగా బాధిస్తున్నాయని సూరజ్ పంచోలీ సోషల్ మీడియాలో తన బాధను పంచుకున్నారు. 2026 ఆగస్టు 2న (ఈరోజు) సూరజ్ పంచోలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సుదీర్ఘమైన లేఖను పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం అవుతున్న అసత్య కథనాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు చట్టపరంగా పూర్తిగా ముగిసిపోయిందని, కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేస్తూ, ఇప్పటికీ పరిష్కారం కాని ప్రశ్నలు ఉన్నాయనేలా కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తన లేఖలో సూరజ్ మాట్లాడుతూ, వాస్తవాలను తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ కోర్టు రికార్డులు, ఇన్వెస్టిగేషన్ రిపోర్టులు అందుబాటులోనే ఉన్నాయని చెప్పారు. సాక్ష్యాలు, ఇన్వెస్టిగేషన్ ఆధారంగా వచ్చిన తీర్పును పక్కన పెట్టి వ్యక్తిగత అభిప్రాయాలతో తీర్పులు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కేసు తన జీవితంపై చూపిన ప్రభావాన్ని కూడా సూరజ్ ఎంతో భావోద్వేగంగా వివరించారు. ఈ ఘటన జరిగినప్పుడు తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని, జియా ఖాన్‌తో తన పరిచయం కూడా నాలుగు నెలలకే పరిమితమైందని గుర్తుచేశారు. ఆమె వ్యక్తిగతంగా ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తనకు తెలియదని, ఆ వయసులో అంతటి క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకునే పరిపక్వత కూడా తనకు లేదని చెప్పారు.
అయితే ఆ ఘటన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని సూరజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా కెరీర్‌ను నిర్మించుకోవాల్సిన 20, 30 ఏళ్ల వయసులో ఎక్కువ భాగాన్ని కోర్టు కేసులు, విచారణలు, ఆరోపణల మధ్య గడపాల్సి వచ్చిందని తెలిపారు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఏకంగా 14 సంవత్సరాలు న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పారు. ప్రతి రోజు మానసికంగా ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొన్నానో తనకే తెలుసని పేర్కొన్నారు. తాను న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో పోరాడానని, చివరకు కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని సూరజ్ వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా కొందరు తనను దోషిగానే చూస్తూ తీర్పులు ఇస్తే, అలాంటి పరిస్థితిలో తాను ఇంకేం చేయగలనో అర్థం కావడం లేదని భావోద్వేగంగా రాశారు.
అదే సమయంలో జియా ఖాన్ గోప్యతను తాను ఎప్పటికీ గౌరవిస్తానని సూరజ్ స్పష్టం చేశారు. ఆమె పేరును ఆధారంగా చేసుకుని అసత్య కథనాలు, వక్రీకరించిన ప్రచారాలు చేయవద్దని ప్రజలను కోరారు. ఒక విషాద సంఘటనను సంచలనంగా మార్చకుండా, నిజాలను గౌరవించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు న్యాయపరంగా కేసు ముగిసిన తర్వాత కూడా సూరజ్ పంచోలి చేసిన ఈ భావోద్వేగ వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి.
- Tags
- cinema
- Sooraj Pancholi
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?