Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- అత్యధిక మెజార్టీ హామీ ఇస్తేనే పోటీ
- ప్రచారానికి రాకున్నా ఓటేయాలని విజ్ఞప్తి
- అద్దె ఇంట్లోనే ఉంటున్నానన్న మంత్రి
- ప్రజాసేవే నా జీవిత లక్ష్యమని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన స్పందిస్తూ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నల్లగొండ ప్రజలు మాట ఇస్తేనే తాను పోటీ చేస్తానని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల నుంచి అలాంటి గ్యారెంటీ లేదా హామీ లభించకపోతే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రాబోయే ఎన్నికల్లో తాను స్వయంగా ప్రచారానికి రాకపోయినా, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని, అందించిన సేవలను చూసి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రజాసేవకే నా జీవితం అంకితం
సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ తనకంటూ సొంత ఇల్లు లేదా అదనపు ఆస్తులేవీ లేవని ఈ సందర్భంగా కోమటిరెడ్డి తెలిపారు. తాను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, కేవలం పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే తనకు ఉందని వివరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తన జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితమని, స్వార్థ రాజకీయాలకు తాను దూరమని పునరుద్ఘాటించారు.
Also Read
- Smuggling Racket: విజయవాడ కేంద్రంగా బంగారం స్మగ్లింగ్.. అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
- Police Martyrs' Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
- CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
- MVSR College : దాండియా వేడుకలో ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ముగ్గురు అరెస్ట్
తాజావార్తలు
-
Devaragattu Bunny Utsavam 2026: దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు అంతా రెడీ.. భారీ భద్రత ఏర్పాటు.. ఉత్సవం వెనుక అసలు కథ ఏంటి?
-
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీకి బూస్ట్.. 19 మున్సిపాలిటీల్లో గెలుపు మాదే..!
-
ICC U19 Women’s T20 World Cup 2027: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. భారత్ తొలి మ్యాచ్ ఎవరితోంటే!
-
Delhi High Court: ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతల వయసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Jio Platforms IPO GMP today: జియో ప్లాట్‌ఫామ్స్ IPOకు భారీ స్పందన.. రూ.276 ప్రీమియం.. లిస్టింగ్ ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!