Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Sigachi Industrial Accident Victims Compensation Delay Telangana

Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?

Published Date :April 24, 2026 , 3:15 pm
By Gogikar Sai Krishna
  • పరిహారం మాటలకే పరిమితం.. బాధిత కుటుంబాల ఆవేదన
  • గల్లంతైన 8 మంది.. ఇంకా ఆచూకీ లేదు
  • క్షతగాత్రుల కష్టాలు.. వైద్యం కోసం పోరాటం
  • న్యాయం కోసం ఉద్యమం.. ఆందోళనల బాటలో బాధితులు
Sigachi Victims: సిగాచి ప్రమాదంలో మృ*తుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

సిగాచి ప్రమాదంలో మృతుల కుటుంబాలకు న్యాయం జరగడం లేదా…? పరిశ్రమ ప్రకటించిన కోటి రూపాయల పరిహారంలో తిరకాసు దాగి ఉందా..? సిగాచి బాధితుల గోడు ఓడవని ముచ్చటగా ఎందుకు మారుతుంది..? బాధిత కుటుంబాలకు అసలు న్యాయం జరిగేదెప్పుడు..? 2025 జూన్ 30 న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 46 మంది చనిపోగా 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికి లభించలేదు. పదుల సంఖ్యలో కార్మికులు గాయపడి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడి బతుకీడుస్తున్నారు. అయితే మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని సిగాచి యాజమాన్యం చెప్పి 10 నెలలు కావస్తున్నా ఇప్పటకి సగం పరిహారం కూడా అందలేదు. దింతో మృతుల కుటుంబాలు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఇక జాడ లేని 8 మంది ప్రమాదంలో కాలి బూడిదయ్యారని అధికారులు అప్పట్లోనే భావించారు. కేంద్ర హోంశాఖకి ఈ ప్రమాదం గూర్చి తెలియజేసి మూడు నెలల్లో జాడ లేని 8 మంది కార్మికుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో చేసేదేమిలేక వారి స్వస్థలాలకు తిరుగుపయనమయ్యారు.
స్పాట్

అయితే ఘటన జరిగి 10 నెలలు కావస్తున్నా ఇటు మృతుల కుటుంబాలకు సిగాచి పరిశ్రమ ప్రకటించిన కోటి రూపాయల పరిహారం అందలేదు. అటు ఆచూకీ లేని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఎట్టకేలకు ప్రమాదం జరిగిన 6 నెలలకు ఇస్నాపూర్ మున్సిపల్ కార్యాలయంలో డెత్ సర్టిఫికెట్ లు అందజేశారు. మృతుల కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారంలో ఇప్పటికి 42 లక్షల రూపాయల వరకు వారి కుటుంబ సభ్యులకు అందింది. అది కూడా విడతల వారిగా ఇచ్చి చేతులు దులుపుకుంది సిగాచి పరిశ్రమ యాజమాన్యం. గతేడాది డిసెంబర్ 28న ఎట్టకేలకు సిగాచి సీఈవో అమిత్ రాజ్ సిన్హాని పటాన్ చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన A2గా ఉన్నారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలకు కాస్త ఊరట లభించింది.

Also Read

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
  • Karimnagar: హృదయ విదారక ఘటన.. తోపుడు బండిపై కుమారుడి శవాన్ని తీసుకెళ్లిన తండ్రి..
Add as a preferred
source on google

PEDDI : ‘పెద్ది’ జూన్ నెలాఖరున రిలీజ్ ఫిక్స్..

అయితే మృతుల కుటుంబాలకు పరిహారం విషయంలో అన్యాయం జరుగుతుందని హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు విచారణ చేయగా సిగాచి పొంతన లేని యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెబుతుంది. ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల పరిహారం ఇస్తామన్న యాజమాన్యం…ఇప్పుడు మాకేం సంబంధం లేనట్టు వ్యవహరిస్తోంది. ఒక్కో కుటుంబానికి 42 లక్షల రూపాయలు ఇచ్చామని సిగాచి యాజమాన్యం చెప్పింది. మిగతావి ఇన్సూరెన్స్ రూపంలో కలుపుకుని వస్తాయని కంపెనీ తరపు లాయర్లు వాదించారు. అయితే పరిహారం చెల్లింపు విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

10 నెలలు కావస్తున్నా సిగాచి మృతుల కుటుంబాలు పరిహారం కోసం పడిగాపులు కాస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలిని పరిశీలించి మృతులకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 10 లక్షల రూపాయలు పరిహారం కంపెనీ తరపున ఇప్పిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికి వారికి న్యాయం జరగలేదు. దింతో ఆందోళన బాట పట్టారు పిశాచి పరిశ్రమైన సిగాచి బాధితులు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట 46 మంది మృతుల కుటుంబాలు, గల్లంతైన 8 మంది ఫ్యామిలీలతో పాటు క్షతగాత్రులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు ప్రజా సంఘాలు, CITU కార్మిక సంఘం మద్దతు తెలిపాయి.

Dr Preeti Reddy: బీజేపీ ఆఫీస్‌కు మల్లారెడ్డి కోడలు.. రాజకీయాల్లో హాట్ టాపిక్!!

సిగాచి ప్రమాదం జరిగి 10 నెలలు కావస్తున్నా గల్లంతైన 8 మంది ఆచూకీ లేదు. అలాగే ముగ్గురు కూతుళ్ళకి పెళ్లి చేయించాల్సిన ఓ తండ్రి ఒక్క అడుగు నడవలేకపోతున్నాడు. ఎర్రని గోరింటాకు పెట్టికోవాల్సిన ఆ యువతి చేతులు నల్లగా కాలిపోయి వెక్కిరిస్తున్నాయి. చివరి వరకు వైద్యం అందిస్తామని హామీ ఇచ్చిన సిగాచి యాజమాన్యం మాట తప్పడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు క్షతగాత్రులు.

సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తామే వైద్య ఖర్చులు భరిస్తామని యాజమాన్యం తెలిపింది. అలాగే క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు వైద్యం అందిస్తామన్న సిగాచి మేనేజ్మెంట్ తీరా క్షతగాత్రులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మాట మార్చింది. బాధితులు నెలవారీ హెల్త్ చెకప్ కోసం…మెడిసిన్ ల కోసం మేనేజ్మెంట్ వద్దకు వెళ్తే తమకు సంబంధం లేదని చేతులెత్తేస్తుంది.

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజేష్ చౌదరి. స్వస్థలం బీహార్. పరిశ్రమలో పేలుడు సమయంలో పై అంతస్తు నుంచి కింద పడ్డాడు. ప్రమాదంలో రెండు కాళ్ళకి తీవ్ర గాయాలతో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడి కొన్ని రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇతనికి ఐదుగురు ఆడ పిల్లలే. ఇద్దరికి పెళ్లి చేశాడు. ఇంకా ముగ్గురు కూతుళ్ళకి మూడు ముళ్ళు..ఏడడుగులు వేపియాల్సిన తండ్రి ఒక్క అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. తాను ఏ పని చేసుకోలేకపోతున్నానని ముగ్గురు బిడ్డలకు పెళ్లి ఎలా చేయాలో అర్థం కావడం లేదని బోరుమంటున్నాడు రాజేష్. అలాగే వైద్యానికి డబ్బులను పరిశ్రమ అందివ్వడం లేదని వాపోతున్నాడు.

ఈ యువతి పేరు సుష్మ సిగాచి పరిశ్రమలో కెమిస్ట్ గా పని చేసేది. ప్రమాదంలో తన కాళ్ళు, చేతులకు తీవ్ర గాయలయ్యి నెలల పాటు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యింది. సుష్మకి పెళ్లి చూపులు చూస్తున్నారు. చేతులకు ఎర్రటి గోరింటాకు పెట్టుకోవాల్సిన ఆమె చేతులు ప్రమాదంలో నల్లగా కమిలిపోయాయి. తన ఎడమ చేతి వేళ్ళు ఇప్పటికి దగ్గరికి రావడం లేదు. దింతో ఆమె ఫిజియోతెరఫీ చేయించుకుంటుంది. దాని కోసం ఆమెకి నెలకి 6 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. సిగాచి పరిశ్రమ మాత్రం నెలకి 2 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడంతో ట్రీట్ మెంట్ కి డబ్బులు లేక హాస్పిటల్ వెళ్లడం లేదు.

ఈమె పేరు దివ్య. మైక్రో బయాలజిస్ట్ గా పని చేస్తున్న దివ్య ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమె కుడి చెయ్యి, వెన్నెముకకి గాయం అయ్యింది. ఆమె నెల నెలా ఆస్పత్రికి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకోవడానికి 20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. గతేడాది డిసెంబర్ నుంచి అంటే 5 నెలలుగా సిగాచి పరిశ్రమ ఆమె వైద్య ఖర్చులకు డబ్బులివ్వడం లేదు. దింతో ఆమె సొంతంగా ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటుంది. అలాగే క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం ప్రకటిస్తే తమకి 9.5 లక్షల రూపాయలే ఇచ్చారని ఆమె ఆరోపిస్తోంది.

సిగాచి ప్రమాదంలో ఆచూకీ లేని 8 మంది జాడ ఇప్పటివరకు లభించలేదు. వెంకటేష్, అఖిలేష్, చిల్వేర్ రవి. రాహుల్ కుమార్, జస్టిన్ పాల్, శివ్ జీ కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, విజయ్ కుమార్ ప్రమాదంలో కాలి బుడిదైనట్టు అనుమానం. దింతో ఆ కుటుంబాల బాధ వర్ణనాతీతంగా ఉంది. చివరి చూపుకి నోచుకోకుండా..కనీసం అంత్యక్రియలు చేయకుండా తమ వాళ్ళు చనిపోయారంటే ఇప్పటికి వారికి నమ్మశక్యం కావడం లేదు.

ప్రమాదంలో మృతి చెందిన వారు ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో వారు పరిహారం కోసం ఎవరి వద్దకు వెళ్లాలో తెలియడం లేదు. ఆ కుటుంబాలకు కార్మిక సంఘం CITU, TPJAC అండగా నిలిచాయి. వారికి న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని తిరకాసు పెట్టకుండా ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే త్వరలోనే సిగాచి బాధితులతో భారీ ఎత్తున ఆందోళనలు, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

మొత్తంగా సిగాచి ఘటన బాధిత కుటుంబాలకు మానని గాయంలా అయ్యింది. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి పరిహారం విషయంలో న్యాయం జరగకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు సిగాచి బాధిత కుటుంబాల గొడుని పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Compensation Issue
  • industrial accident India
  • Sangareddy News
  • Sigachi accident
  • telangana news

తాజావార్తలు

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..

  • Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions