CM Revanth Reddy : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని పాశమైలారంలో జరిగిన సిగాచి రసాయన పరిశ్రమ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఉదయం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశ్రమను స్వయంగా పరిశీలించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పరిశ్రమ ప్రాంతాన్ని తనిఖీ చేసిన అనంతరం, సీఎం స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రమాణాల అమలుపై…