Bird flu: తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాకు తాకింది ఈ వ్యాది. తొగుట మండలంలోని కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో గత కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిగా ఆ శాఖ అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు సిద్ధిపేట జిల్లా అధికారులు ఫాంలోని కోళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించగా బర్డ్ ఫ్లూ అని నిర్దారణ అయింది.
Read Also: Jala Harathi Corporation: సీఎం ఛైర్మన్‌గా జలహారతి కార్పొరేషన్..
ఇక, కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో పరిసరాల్లో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్ లో పని చేస్తున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూతో ఇప్పటికే 20 వేలకు పైగా కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. మిగిలిన 50 వేల కోళ్లను చంపి వేయ్యాలని అధికారుల నిర్ణయం తీసుకున్నారు. 20 టీంలుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూడ్చేస్తున్నారు. అలాగే, కిలో మీటర్ పరిధిలో ఏవైనా కోళ్ల ఫారాలు ఉంటే ఆ కోళ్లను కూడా చంపెయ్యాలని పశువైద్యాధికారులు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూపై జిల్లా పశుసంవర్ధక కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏవైనా అనుమానాలు ఉంటే 85004 04016 నెంబర్ కి కాల్ చేయాలని సూచనలు జారీ చేశారు.