సిద్దిపేటలో వర్షం తీవ్రంగా కురుస్తోంది. కోమటిచెరువు నాలా ఉప్పొంగడంతో పట్టణం జగదిగ్బంధంలో చిక్కుకుంది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు, ఎల్లుండి (ఆగస్టు 29, 30) సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది.
Medak- Kamareddy : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఈ మేరకు రెండు జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. రేపు సాయంత్రం వరకు ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. Read Also : Pocharam Project :…