ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోసారి పాన్ ఇండియా రేంజులో చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి స్టార్ కాస్ట్, భారి బడ్జట్, భారి అంచనాలు… ఇలా ప్రతి విషయంలో హ్యూజ్ గా కనిపిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి ఇటివలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్, సినిమాపై అంచనాలని పెంచింది. ఈ మూవీ 2024 సంక్రాంతి రిలీజ్ అవ్వనుందని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలు చూస్తుంటే ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ 2024 సమ్మర్ కి షిఫ్ట్ అయినట్లే కనిపిస్తోంది. ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్ వాయిదా వెనకున్న అతిపెద్ద కారణం ‘ఇండియన్ 2’ మాత్రమే. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్న శంకర్, ఈ మూవీని నవంబర్ నెలలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడట. జూన్ నెల నాటికి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసేలా శంకర్ ప్లాన్ చేసుకున్నాడట.
నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టిన రోజు ఉంది, నవంబర్ 12న దీపావళి పండగ ఉంది. ఈ రెండు అకేషన్స్ ని బాలన్స్ చేస్తూ ఇండియన్ 2 సినిమాని నవంబర్ 10న రిలీజ్ చెయ్యడానికి శంకర్ రెడీ అవుతున్నాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇండియన్ 2 రిలీజ్ అనేది నిజమే అయితే శంకర్, ‘గేమ్ చేంజర్’ని పక్కా వాయిదా వేస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే శంకర్ తన సినిమా ప్రమోషన్స్ కోసం భారి ప్లానింగ్ వేసుకుంటాడు, రాజమౌళిలా అన్ని ప్రాంతాలకి తిరుగుతాడు. ఇలాంటి సమయంలో ‘గేమ్ చేంజర్’ సినిమాపై శంకర్ దృష్టి పెట్టే అవకాశం ఉండదు, పైగా నవంబర్ నెలలో ఇండియన్ 2 రిలీజ్ మిస్ అయితే 2024 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూనే ఇండియన్ 2 రిలీజ్ కావాల్సి ఉంది. అలాంటి సమయంలో తన సినిమాపై తనే పోటీకి దిగడు కాబట్టి శంకర్, ‘గేమ్ చేంజర్’ సినిమాని సమ్మర్ కి పుష్ చేసే అవకాశం ఉంది. మరి ఈ మేకింగ్ మాస్టర్ ఏం ప్లాన్ చేస్తాడో చూడాలి.