దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయలో శివకల్యాణ మహోత్సవములు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 5 రోజుల పాటు శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్సవాలు జరుగనున్నాయి. రేపు అభిజిత్ లగ్న ముహూర్తమున వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ పార్వతీరాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. స్వామి వారిని దర్శించుకునేందకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేములవాడకు చేరుకుంటున్నారు.
అయితే 23 తేదీన పట్టణ పుర వీధుల్లో రథోత్సవం పై స్వామి వారు ఊరేగునున్నారు. ఇప్పటికే శివకల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.