దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు.…
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
Duddilla Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలోని లక్ష్యాలను స్పష్టంగా వెల్లడించారు. సిరిసిల్లను నేతన్నలకి నిలయంగా అభివర్ణిస్తూ, రాష్ట్రంలో చేనేత కార్మికుల బతుకులకు ఉజ్వల భవిష్యత్ అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. దేశవ్యాప్తంగా చేనేత రంగానికి గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పబద్ధంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. వేములవాడ ఆలయం గురించి ప్రస్తావిస్తూ, ఇది దేశ…
Lady Aghori : గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ నానా హల్ చల్ చేస్తోంది. ప్రతి ఆలయానికి వెళ్తూ అక్కడ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేములవాడలోని రాజన్న ఆలయానికి వెళ్లేందుకు రెడీ అయింది. లేడీ అఘోరీ వస్తుందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆమెను జిల్లా సరిహద్దుల్లోనే ఆపేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశించారు. దాంతో పోలీసులు జిల్లెళ్ల చెక్ పోస్టు వద్ద భారీగా మోహరించారు. ఆమెను ఆలయం వద్దకు వెళ్లనీయకుండా…
పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్! వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య…
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి సందర్భంగా…
వేములవాడ రాజన్న సన్నిధిలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. రేపు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. శివరాత్రికి 1500 పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి జాతర కోసం వివిధ డిపోల నుండి 778 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు…
Vemulawada : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. విషయం తెలుసుకున్న…
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా కొండా సురేఖ తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రచారమవుతున్న తప్పుడు వార్తలను మంత్రి సురేఖ ఖండించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వేములవాడలో పర్యటించనున్నారు. దేవాలయ అభివృద్ధికి రూ. 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణకు రూ. 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ…