Shabbir Ali: కమీషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని కాంగ్రెస్ పార్టీ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని కంటేశ్వర్ లో గల 19, 20వ డివిజన్లలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్ లో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజల బలహీనతలతో ఆడుకునే అలవాటు బీఆర్ఎస్ పార్టీది అని అన్నారు. ఉద్యమంలో యువకులను రెచ్చగొట్టి వారి ప్రాణాలు బలి తీసుకున్నారని తెలిపారు. కాని లబ్ధిమాత్రం కేసిఆర్ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ నాయకులు పొందారని కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటాలతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం రాజభోగాలు ఏలుతుందని అన్నారు. ఎమ్మెల్యే నగరంలోని వనరులన్నీ దోచేసి ప్రజలను పట్టించుకోకుండా భూ బకాసురుడిలా పేదల భూములు లాక్కుంటున్నాడని తెలిపారు. కమిషన్లు వచ్చే పనులు తప్ప పేదలకు ఉపయోగపడే పనులు మాత్రం చేయడని అన్నారు.
Read also: Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి
నిజామాబాద్ పట్టణం అభివృద్ధిలో 15 సంవత్సరాలు వెనక వెళ్లిపోయిందని తెలిపారు. పట్టణంలో ఎక్కడ చూసినా శాశ్వత అభివృద్ధి జరగలేదన్నారు. పేదలను పేదలుగానే ఉంచి వారికి పెన్షన్లు ఇచ్చి వారిని దాంతోనే సంతృప్తి పరిచారని మండిపడ్డారు. పెన్షన్ ఈ చేతితో ఇచ్చి నిత్యవసరాల సరుకుల ధరలు పెంచి వంటగ్యాస్ ధర 1200 చేసి లూటీ చేశారని అన్నారు. వారికి శాశ్వతంగా వారి ఆర్థిక పరిస్థితులు పెరిగే ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు. విద్యా, ఉద్యోగ ఉపాధి, పరిశ్రమలు తీసుకురాలేదని మండిపడ్డారు. కాంగ్రేస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలతో ఇంటింటికి పోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ తన 10 సంవత్సరాల పాలనలో ఒక్క ఇళ్లు కట్టించి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయని అన్నారు. తమ పార్టీ ఆరు గ్యారెంటి హామీలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే మెనిపెస్టు, బీసీ డిక్లరేషన్ మైనార్టీ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్ తో ముందుకు వెళుతున్నామని అన్నారు. తను లోకల్ లో వుంటూ ప్రజలకు అందుబాటులో వుంటానని అన్నారు.
Jammu Encounter: రాజౌరిలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్… ఒక ఉగ్రవాది.. నలుగురు జవాన్లు మృతి