జూబ్లీహిల్స్ అమ్నిషియా పబ్ మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో నిందితులను పోలీసులు కస్టడీలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మొదటి రోజు విచారణ ముగిసింది. అయితే పోలీసుల కస్టడీ విచారణ కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు మైనర్‌లను, ఒక మేజర్ ను విడివిడిగా ఇన్వెస్టిగేషన్ అధికారి బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ విచారించారు. అత్యాచార ఘటనలో చేసిన పనిని ఒకరిపై ఒకరు నెట్టుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే గ్యాంగ్ రేప్ కేసులో తమ తప్పు ఏమి లేదంటున్న మైనర్లు వెల్లడించారని, తమను సాదుద్దీన్ మాలిక్ రెచ్చగొట్టాడని చెప్తున్న మైనర్లు తెలిపారు.
నాకంటే ముందు మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించింది మైనర్ లే అని సాదుద్దీన్ తెలిపినట్లు, బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే తనయుడు అసభ్యంగా ప్రవర్తించారని, అనంతరం మేము అనుసరించామని స్టేట్ మెంట్. కాన్స్ బేకరి నుండి మార్గం మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడని తమతో రాలేదని తెలిపారు. బెంజ్ కార్ కాన్స్ బేకరిలో పార్క్ చేసి ఇన్నోవాలో ఐదుగురం వెళ్ళామని స్టేట్ మెంట్ ఇచ్చారు. ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా ఎస్కేప్ అయ్యామని, ఎక్కడకు ఎస్కేప్ అవుతున్నాము అన్న విషయం ముందుగా డిసైడ్ కాలేదు ఆని అని తెలిపారు. పోలీసుల కస్టడీకి విచారణలో పాతబస్తీకి చెందిన ఓ ఛానల్ సీఈఓ కొడుకు మైనర్ ప్రమేయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వైద్య పరీక్షలు ఆలస్యం కావడంతో పోలీసులు మొదటి రోజు గంట పాటు విచారణ చేశారు. మరికాసేపట్లో మైనర్‌లను సైదాబాద్ లోని జువనైల్ హోమ్ కు తరలించనున్నారు.