హైదరాబాద్ లో మునవర్ ఫరూకి షో పై సస్పెన్స్ నెలకొంది. మునవర్ ఫరూకి హాజరవుతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోవడం పై ఉత్కంఠ నెలకొంది. తనకు ఫీవర్ రావడంతో నిన్న బెంగుళూరులో జరగాల్సిన షో పోస్ట్ పోన్ చేశాడు మునావర్. అయితే కోవిడ్ టెస్ట్ రిజల్స్ట్ ఇంకా రాలేదని, కోవిడ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నానని మునావర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయడంలో మునావర్ హైదరాబాద్ షోకు వస్తాడా? రాడా? అనే విషయం పై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కి రానున్నట్లు ప్రకటించిన మునావర్.. నెట్ వర్క్ లేకపోవడం వల్ల లైవ్ లోకి రాలేకపోతున్నాన్న తెలిపాడు. తన లైవ్ తర్వాత హైదరాబాద్ షో కి హాజరవుతాడా లేదా అనే అంశంపై క్లారిటీ రానుంది.
మునావర్ షోకు ఇప్పటికే శిల్పకళావేదిక భారీగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. మునావర్ షో కి మాదాపూర్ పోలీసులు నిన్న పర్మిషన్ ఇవ్వడంతో.. అభిమానుల్లో సందడి నెలకొంది. బుక్ మై షో లో టికెట్స్ పూర్తీగా అమ్ముడుపోయాయి. 2 వేల టికెట్స్ నిర్వాహకులు అమ్ముడు పోయాయి. కానీ.. మునావర్ హైదరాబాద్ రానున్న విషయం పై ఇంకా క్లారటీ రాలేదు. అయితే మునావర్ షోను బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్, బీజేవైఎం నేతలు షో ని అడ్డుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. హిందూ దేవుళ్లను హేళన చేస్తూ షోలు చేస్తే ఊరుకునేది లేదంటున్న ఎమ్మెల్యే రాజసింగ్ మండిపడ్డారు. నిన్న ఎమ్మెల్యే రాజసింగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు లాలగూడా పీఎస్ కి తరలించారు.
ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా.. శిల్పకళా వేదిక వద్ద భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. అందరి ఐడీ కార్డ్స్ టికెట్స్ చూసి ఆ తరువాత అనుమతిస్తామన్నారు. షోలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. షో అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై ద్రుష్టి పెట్టామన్నారు. ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, నిబంధనలకు లోబడే అనుమతులు ఇచ్చామనా స్పష్టం చేశారు.
CJI NV Ramana: విభజన వల్ల ఏపీ నష్టపోయింది.. ఏపీని ఆదుకోవాలి