Ramachandra Reddy: రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Solipeta Ramachandra Reddy passed away: రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి అనారోగ్యంతో ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా చిత్తాపూర్‌కు చెందిన ఆయన ప్రస్తుత వయస్సు 92 సంవత్సరాలు. మొదటి తరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో రామచంద్రారెడ్డి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కాలం అంతా రాజకీయాల్లోనే కొనసాగారు. ఆయన స్వగ్రామమైన చిత్తాపూర్ సర్పంచ్‌గా పని చేయడంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా కూడా పనిచేశారు. తర్వాత దొమ్మాట శాసనసభ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
Read also: Cumin Price Hike: బంగారాన్ని మించి దూసుకుపోతున్న జీలకర్ర ధర
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఆయన రాజ్యసభ హామీల స్థాయి కమిటీ సభ్యుడు కూడా. అంతే కాకుండా రాజ్యసభలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇటీవలి కాలంలో భారత్-చైనా స్నేహ మండలి అధ్యక్షుడిగా పనిచేశారు. అతను CR ఫౌండేషన్ మరియు తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ వంటి సంస్థలలో కూడా సభ్యుడు. కొంత కాలం లోక్ సత్తాలో కూడా పనిచేశారు. 70 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతున్న సోలిపేట రామచంద్రారెడ్డిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డికి మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి గురువుగా వ్యవహరిస్తారు. సినారె తన చిన్న కుమార్తెను రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వరరెడ్డితో వివాహం చేశారు. ఇదిలా ఉండగా.. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని 272ఏలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
Read also: Students Missing: విశాఖలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం.. ఒకేసారి ముగ్గురు..
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో తెలంగాణ మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
సోలిపేట రామచంద్రారెడ్డి మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు సంతాపం తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకం. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఆయన చాలా మందికి ఆదర్శం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Muthireddy Daughter: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తెపై కేసు..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!