Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
- తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
- తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడుతానన్న డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana DGP Jitender: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్. పోలీస్ బాస్‌గా ఛార్జ్ తీసుకున్న జితేందర్‌కు పలువురు పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. డీజీపీకి ఛార్జ్ తీసుకోకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తనను డీజీపీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీని మార్చడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ సీఎస్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.
నూతన డీజీపీ జితేందర్ 2025 సెప్టెంబర్‌లో రిటైర్డ్ కానున్నారు. డీజీపీగా 14 నెలల పాటు సేవలు అందించబోతున్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడుతానని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. నేరాల కట్టడికి, సైబర్‌క్రైమ్ నియంత్రణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో డ్రగ్స్‌ను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read
Read Also: Group-2: గ్రూప్ -2 పోస్టులను పెంచి డిసెంబర్లో నిర్వహించాలి.. ప్రభుత్వానికి అభ్యర్థుల విజ్ఞప్తి
పంజాబ్‌లోని జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ఇప్పుడు డీజీపీగా నియామకమయ్యారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!