ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్‌ను సిట్ ప్రశ్నించింది. అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ గా ఐపీఎస్ అనిల్ కుమార్, హోమ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఐపీఎస్ జితేంద్ర పని చేశారు. జితేందర్, అనిల్ కుమార్ దగ్గర నుంచి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది.
తెలంగాణ నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీ రవిగుప్తాను హోమ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేసింది. పంజాబ్‌కు చెందిన జితేందర్ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి జితేందర్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి డీజీపీ అయ్యారు.